స్టార్ హీరోకి అందుకే ఆర్థిక కష్టాలు

Update: 2017-07-17 06:34 GMT
ఒకప్పుడు ఆయనో హీరో. ఓ స్టార్ హీరో వారసుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టినా.. అభిమానులు భారీగానే ఆదరించినా.. ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ వచ్చినా.. హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. మెల్లమెల్లగా ఫేడవుట్ అయిపోయాడు. హీరోగా సినిమాలు మానేసి.. నిర్మాతగా అదృష్టం పరీక్షించుకున్నాడు.

కానీ అక్కడ కూడా విధి వెక్కిరించింది. లాభాలు రాకపోగా భారీగా నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాతి కాలంలో ఈ మాజీ హీరో తమ్ముడు సినిమా హీరో అయ్యాడు. పెద్ద స్టార్ అయిపోయాడు కూడా. ఇప్పుడు ఈ అన్న కారణంగా.. తమ్ముడు తెగ కష్టాలు పడుతున్నాడట. అప్పట్లో అన్న నెత్తిపై పడ్డ అప్పులు అన్నిటినీ మెల్లగా తీర్చుకుంటూ వస్తున్నాడట. సహజంగా మెల్లగా సినిమాలు చేస్తాడనే పేరున్న ఈ స్టార్.. ఈ మధ్య కాలంలో వేగం పెంచాడు. ఏ స్టార్ హీరోకు లేనంత సినిమాల లైనప్ ఈయనకు ఉండడానికి కారణం.. ఆయా నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసుకుని.. అన్న అప్పులు కట్టేయడమే అంటున్నారు. అలా ఆ స్టార్ హీరో బోలెడన్ని ఆర్థిక కష్టాలను ఫేస్ చేస్తున్నాడట.

నిజానికి ఈ స్టార్ కు డబ్బుల కష్టాలు అంటే ఎవరూ నమ్మే పరిస్థితి కూడా ఉండదు. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే హీరో అయిన ఈయన.. బోలెడన్ని యాడ్స్ కూడా చేస్తూంటాడు. అంత సంపాదిస్తున్నా.. పేరుకుపోయిన అప్పులను తీర్చడానికే సరిపోతోందట. అన్నపై ఉన్న మమకారానికి తోడు.. అన్న పరిస్థితి తండ్రి ఆరోగ్యంపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశ్యంతోనే ఇంతగా తపన పడుతున్నాడట ఈ స్టార్ హీరో.
Tags:    

Similar News