టాలీవుడ్ హీరోల మ‌ధ్య యుద్ధం

Update: 2016-06-23 17:30 GMT
పంక్రాంతి అన‌గానే కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, మందు, ముక్క‌.. ఇవ‌న్నీ కామ‌న్‌! అయితే, ఈ సంద‌డిలో హ‌వా సృష్టించేదే సినిమా!!. మాస్ నుంచి క్లాస్ వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ సంక్రాంతికి కొత్తంద‌నాన్ని చ‌వి చూడాల‌నుకుంటారు. దీనిని అందిపుచ్చుకున్న సినీ రంగం అంద‌రినీ సంతోష పెట్టేలా సంక్రాంతిని సంబ‌రాల‌తో హోరెత్తిస్తుండ‌డం కొన్ని ద‌శాబ్దాలుగా మ‌న‌కు తెలిసిందే. రానురాను సంక్రాంతి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు పెద్ద ఆదాయ వ‌న‌రుగా మారింది. అంటే అగ్ర హీరోల మొద‌లు చిన్నాచిత‌క‌ హీరోల వ‌ర‌కు ప్ర‌తి సంక్రాంతికీ త‌మ చిత్రాన్ని విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో.. రానున్న 2017 సంక్రాంతికి కూడా మెగా హీరోల మొద‌లు చోటా హీరోల వ‌ర‌కు త‌మ‌దైన బాణీలో ముందుకు పోతున్నారు. అదెలాగంటే.. సీనియర్ హీరోల్లో ఇప్పటికీ మంచి ఫాంలో ఉన్న నాగార్జున ప్రస్తుతం మరో భక్తిరస చిత్రం నమో వెంకటేశాయలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించేశారు.

ఇక బాలకృష్ణ వందోచిత్రంగా తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణిని కూడా అదే సమయంలో రిలీజ్ చేసుకుందుకు రెడీ అవుతున్నారు. చాలా ఏళ్లుగా ఊరిస్తున్న మెగా స్టార్ రీ ఎంట్రీ చిత్రం కత్తిలాంటోడును కూడా సంక్రాంతి బరిలోనే దించాలన్న ప్లాన్ లో ఉంది మెగా కాంపౌండ్. అంతేకాదు మరో మెగాహీరో పవన్ కళ్యాణ్ హీరో డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాను కూడా సంక్రాంతి సమయానికి ప్లాన్ చేస్తున్నారు.

 ఈ సారి ఏకంగా నలుగురు టాప్ స్టార్స్ సినిమాల‌ను సంక్రాంతికి ప్లాన్ చేస్తుండ‌డంతో తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్ల స‌మ‌స్య త‌లెత్తే అవకాశం ఉంద‌ని సినీ ప్రియులు భావిస్తున్నారు. మరి ఈ సమస్యలను పక్కన పెట్టి మ‌న హీరోలు బాక్సాఫీస్ బ‌రిలోకి దిగుతారో లేక ఇబ్బంది లేకుండా డేట్స్ అడ్జస్ట్ చేసుకుని..వీరిలో కొంద‌రు త‌మ సినిమాలు వాయిదా వేసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News