తమ అభిమాన హీరో స్టిల్ కనిపిస్తే.. ఖుషీ అయిపోతారు ఫ్యాన్స్. అలాంటిది స్టార్లు మొత్తం ఒకే ప్రేమ్ లో కనిపిస్తే..? ప్రాణమిత్రుల్లా భుజాలపై చేతులు వేసుకొని కెమెరాకు ఫోజు ఇస్తే..? చూడ్డానికి అభిమానుల రెండు కళ్లూ చాలవు కదూ! అలాంటి.. స్టిల్ ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 50 వ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లో ధూం ధామ్ గా వేడుక నిర్వహించారు. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ కు టాలీవుడ్ స్టార్లంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్లిక్ మనిపించిన ఓ ఫొటోలో.. మహేష్ బాబు - ప్రభాస్ - రామ్ చరణ్ - రామ్ - విజయ్ దేవరకొండ - నాగ చైతన్య - దిల్ రాజు కుటుంబం ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. ఈ ఫొటో అభిమానులను ఎంతగానో అలరిస్తోంది.