రిజల్ట్ ఏమైంది పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది కాస్త పక్కన పెడితే సాహో తెలుగు సినిమా స్థాయిని ఇంకాస్త పైకి తీసుకెళ్ళిన మాట వాస్తవం. లేకపోతే డిజాస్టర్ టాక్ తో రెండు వందల కోట్లు దాటడం అంటే మాటలు కాదు. అందులోనూ నెగటివ్ రివ్యూస్ ఎక్కువగా వచ్చిన నార్త్ లోనే మంచి వసూళ్లు రాబడుతుండటం అక్కడి ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. ఇదిలా ఉండగా టాలీవుడ్ స్టార్ హీరోలు దర్శకులు ఇప్పటిదాకా సాహో గురించి అఫీషియల్ గా స్పందించలేదు.
ట్విట్టర్ ద్వారానో సోషల్ మీడియా యాప్స్ ని వేదికగానో తీసుకుని సాహోని సపోర్ట్ చేస్తూ ఎలాంటి మెసేజ్ పెట్టలేదు. మారుతీ లాంటి ఒకరిద్దరు తప్ప ఇంకీ పూర్తి స్థాయిలో మద్దతు దక్కలేదు. హింది హీరోలు స్పందించలేదు అంటే అందులో ఆశ్చర్యం లేదు కాని మనవాళ్ళు మౌనంగా ఉండటమమే షాక్. రిపోర్ట్స్ రివ్యూస్ చూసి ఎందుకులే స్పందించడం అని చాలా మంది సైలెంట్ గా ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ - ఎవరు లాంటి బడ్జెట్ సినిమాలకు స్టార్ల మద్దతు బాగా దక్కింది. అది ఒకరకంగా అవి బూస్ట్ అవ్వడానికి హెల్ప్ అయ్యాయి కూడా.
ప్రభాస్ రేంజ్ కి అలాంటి మద్దతు అవసరం లేనప్పటికీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సాహో గురించి సోషల్ మీడియాలో ఇతర హీరోల ఫ్యాన్స్ ట్రోలింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళో మాట బాగుందని చెబితే ఆటోమేటిక్ గా ఇంకే కామెంట్స్ రాకపోవచ్చు. కాని అది వాస్తవ రూపం దాల్చే అవకాశం కనిపించడం లేదు. ఏది చెప్పినా మొదటి వారం పదిరోజుల లోపు చెబితేనే ఏ సినిమాకైనా క్రెడిబిలిటీ ఉంటుంది. తర్వాత తాపీగా చెప్పినా వచ్చే ప్రయోజనం శూన్యమే.