వచ్చే ఏడాది లేనట్లే.. వాళ్లకు నిరాశే

Update: 2022-12-17 23:30 GMT
కరోనా వల్ల ఒక ఏడాది పూర్తిగా.. మరో ఏడాది పాక్షికంగా సినిమా ఇండస్ట్రీ కోల్పోవాల్సి వచ్చింది. బాలీవుడ్‌ ఇంకా కూడా కోలుకోలేదు కానీ మన సౌత్‌ సినిమా ఇండస్ట్రీ ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రం కరోనా తర్వాత కోలుకున్నట్లుగానే కనిపిస్తుంది. 2022 సంవత్సరంలో సాధ్యం అయినన్ని ఎక్కువ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. భారీ విజయాలు కూడా నమోదు అయ్యాయి.

అయితే ఈ ఏడాది ని కొందరు హీరోలు మిస్ చేసుకున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్‌ 2021 డిసెంబర్‌ లో పుష్ప సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో వెంటనే విడుదల కావాల్సిన పుష్ప 2 ను ఆలస్యం చేస్తున్నారు. దాంతో 2022 సంవత్సరంలో బన్నీ సినిమా ను అభిమానులు చూడలేక పోయారు. 2023 లో కూడా పుష్ప 2 సినిమా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

ఇక గత ఏడాది చివర్లో వచ్చిన అఖండ సినిమా తో ఆకట్టుకున్న బాలయ్య ఈ ఏడాది మిస్‌ చేశాడు. అయితే 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అన్ని అనుకున్నట్లుగా సెట్‌ అయితే 2023 లో రెండు సినిమాలు బాలయ్య నుండి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక 2023 లో తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కొన్ని సినిమాలు రాకపోవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ కే తో పాటు సలార్‌ సినిమా కచ్చితంగా 2023 లో రానట్లే అంటూ ఇప్పటికే ఆయా చిత్రాల యూనిట్‌ సభ్యుల నుండి లీక్ అందుతోంది. 2023 లో ప్రభాస్ ఆదిపురుష్‌ తో రాబోతున్నాడు కానీ ఆ రెండు సినిమాలు మాత్రం కష్టమే.

ఇక రామ్‌ చరణ్‌ హీరోగా రూపొందుతున్న శంకర్‌ సినిమా ను 2023 లో విడుదల చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చివరి నిమిషంలో వాయిదాలు పడుతూ 2024 వరకు వాయిదా పడుతూ రావచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా తో ఈ ఏడాది అలరించిన కొరటాల శివ తదుపరి ఏడాది అంటే వచ్చే ఏడాదిలో కొరటాల శివ సినిమా మొదలు పెట్టబోతున్నాడు. ఆ సినిమా వచ్చే ఏడాదిలో వస్తుందా అంటే కష్టమే అన్నట్లుగా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మహేష్ బాబు సినిమా విషయంలో కూడా రకరకాల ప్రచారం జరుగుతోంది. 2023 సంవత్సరంలో షూటింగ్ ప్రారంభం అవుతుందా అంటే అనుమానమే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వచ్చే ఏడాది అభిమానులను ఆయా హీరోలు నిరాశ పర్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News