టాలీవుడ్: ఇప్పటికీ కమిట్మెంట్ల జోరు సాగుతోందట!

Update: 2019-11-07 01:30 GMT
లైంగిక వేధింపుల వ్యహరాలపై ప్రపంచవ్యాప్తంగా మహిళలు తమ గళం వినిపించడం కొంతకాలం క్రితం మీడియాలో ప్రముఖంగా చర్చకు వచ్చింది.  క్యాస్టింగ్ కోచ్ వ్యవహారాలు వెల్లడిస్తూ #మీటూ పేరుతో ఒక ఉద్యమమే ప్రారంభం అయింది.  అది ఇండియాకు కూడా రావడం.. బాలీవుడ్ కూడా షేక్ కావడం కూడా తెలిసిన విషయాలే. చివరికి కొలీవుడ్.. టాలీవుడ్ లకు కూడా #మీటూ హీట్ తగిలింది.

అయితే  ఆరోపణలను చేసినవారిలో ఎక్కువమంది చట్టప్రకారం ముందుకువెళ్ళకపోవడంతో మీటూ ఉద్యమం చల్లబడింది.  సెన్సేషన్ కోసం.. టీవీ ఛానెల్ డిబేట్స్ లో కెవ్వుకేకలు.. పొలికేకలు.. పెడబొబ్బలు పెట్టడం కోసం అవన్నీ పనికొస్తాయి కానీ కోర్టువారి ముంగిట ఆ ఆరోపణలు నిలబడాలంటే మాత్రం ఋజువులు తప్పనిసరి.  అయితే మెజారిటీ సందర్భాలలో ప్రూఫ్స్ లేకపోవడంతో #మీటూ ఆరోపణలు చేసే వారిపై కూడా అనుమానాలు నెలకొంటున్నాయి.  ఇదంతా గతం.. ప్రస్తుతం టాలీవుడ్ ఎలా ఉంది? ఇప్పటికీ కమిట్మెంట్స్ ఉన్నాయా?

మీటూలతో క్యాస్టింగ్ కోచ్ వ్యవహారాలు ఇంకా అక్కడక్కడ నడుస్తున్నాయి అంట . అప్పట్లో కెమెరాలు.. సీక్రెట్ రికార్డింగ్స్ లాంటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండే ప్రబుద్ధులు ఇప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటున్నారట.  కొంతమంది కొత్త  హీరోయిన్ లను సినిమాలకు సైన్ చేసే సమయంలో 'విత్ కమిట్మెంట్' అని డైరెక్ట్ గానే అడుగుతున్నారట. ఈమధ్య టాలీవుడ్ లో అడుగుపెడుతున్న ముంబై భామలు ఇలాంటి వాటికి ఏమాత్రం మోహమాటం.. సంకోచం లేకుండా సైసై అంటున్నారట.. అవకాశాలను ఒడిసిపట్టుకుంటున్నారట. అంటే..ఎవరెన్ని నీతి సూత్రాలు వల్లించినా టాలీవుడ్ లో పరిస్థితి మాత్రం అలాగే ఉందట!...కొందరు మాత్రం  మొహమాటం లేకుండా ముందే చెప్పేస్తున్నారు మేము ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వం అని

Tags:    

Similar News