పెద్ద పెద్ద హీరోలకి అభిమానగణం భారీగానే వుంటుంది. వీళ్ళు అభిమానులను నేరుగా కలిసే ఫంక్షన్ దాదాపు తమ సినిమా ఆడియో లేక సక్సస్ మీట్లే. తాము ఎంతగానో ఆరాధించే స్టార్లను చూడడానికి ఎక్కడెక్కడినుంచో అభిమానులు తరలివస్తారు. అయితే ఈ ఫంక్షన్ లలో జరుగుతున్న తొక్కిసలాట కారణంగా జనాలు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితికూడా ఎదురైన సందర్భంలో ఇటువంటి అవుట్ డోర్ ఫంక్షన్ లకి అనుమతి నిరాకరిస్తుంది.
ఈ దెబ్బతో గత కొన్నేళ్ళుగా ఇండోర్ లోనే ఈవెంట్లు జరగడం, లిమిటెడ్ క్రౌడ్ తో కానిచ్చేయడం ఒకింత నిరాశకి గురిచేస్తుంది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి కొద్దికొద్దిగా మారుతుంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఫంక్షన్లకు భారీ వేడుకలేకాక భారీ బందోబస్తుకూడా సమకూర్చడం విశేషం.
బాహుబలి ఆడియో లాంచ్ పెర్మిషన్ కి హైదరాబాద్ లో చుక్కెదురైనా తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఇటీవల గౌతమీపుత్రా శాతకర్ణి ఆడియోని సైతం అక్కడే విడుదలచేశారు. ఇప్పుడు మెగాస్టార్ 150వ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని విజయవాడలో మునిసిపల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్యాన్స్ కి ఎటువంటి కష్టంలేకుండా ఈ చిత్రాలన్నీ 'అందరూ ఆహ్వానితులే' అని ప్రమోట్ చెయ్యడం ఆనందకరం. ఈ ట్రెండ్ హిట్ అయితే పెద్ద హీరోల సినిమాలన్నీ ఈ మార్గాన్నే అనుసరించే అవకాశం వుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/