టాలీవుడ్ టాప్-10 సినిమాలు ఇవే

Update: 2016-09-20 09:30 GMT
టాలీవుడ్లో చాన్నాళ్ల తర్వాత కలెక్షన్ల గురించి.. రికార్డుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘జనతా గ్యారేజ్’కు మొదట్లో టాక్ ఎలా ఉన్నప్పటికీ.. కలెక్షన్ల విషయంలో మాత్రం అంచనాలకు తగ్గట్లే రికార్డుల మోత మోగించింది. ఇప్పటిదాకా దాదాపు రూ.80 కోట్ల దాకా షేర్ వసూలు చేసి టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్లలో మూడో స్థానానికి దూసుకొచ్చింది. ఈ నేపథ్యంలో అసలు టాలీవుడ్లో అత్యధిక షేర్ వసూలు చేసిన పది సినిమాల సంగతేంటో చూద్దాం పదండి.

టాలీవుడ్ నెంబర్ వన్ ‘బాహుబలి’నే అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు వెర్షన్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 192 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. అన్ని వెర్షన్లూ కలుపుకుంటే లెక్క రూ.320 కోట్లు దాటిపోతుంది. ఇక రెండో స్థానంలో ఉన్న శ్రీమంతుడు తమిళంతో కూడా కలిపి రూ.85.5 కోట్ల షేర్ వసూలు చేసింది. జనతా గ్యారేజ్ ప్రస్తుతం దాదాపు రూ.80 కోట్ల షేర్‌ తో మూడో స్థానంలో ఉంది.

డబ్బింగ్ కూడా కలుపుకుంటే మగధీర (రూ.78 కోట్లు).. సరైనోడు (రూ.76 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ‘అత్తారింటికి దారేది’ రూ.75.5 కోట్లతో ఆరో స్థానంలో ఉంది. అత్తారింటికి దారేది తెలుగులో మాత్రమే రిలీజైంది. డబ్బింగ్ వెర్షన్లను మినహాయిస్తే.. నాలుగో స్థానం ఆ సినిమాదే. ఇక పవన్ కళ్యాణ్ మరో సినిమా ‘గబ్బర్ సింగ్’ రూ.61 కోట్లతో ఏడో స్థానంలో ఉంది. రేసుగుర్రం రూ.59 కోట్లతో.. దూకుడు రూ.57 కోట్లతో.. నాన్నకు ప్రేమతో రూ.54 కోట్లతో వరుసగా 8 - 9 - 10 స్థానాల్లో ఉన్నాయి. ఈ లెక్కలు ఓ అంచనా మాత్రమే.
Tags:    

Similar News