పెద్ద సినిమాకు పనిచేస్తే గుర్తింపు కూడా అదే స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది కానీ అన్ని చోట్ల స్వేచ్చ మాత్రం ఉండదు. ఎందుకంటే సలహాలు.. సూచనలు ఇచ్చేవారు ఎక్కువ అవుతారు. హీరో ఒకటి చెప్తే.. డైరెక్టర్ ఒకటి చెప్తాడు.. నిర్మాత ఇంకోటి. ఇలా అసలు పనికి ఒక్కోసారి ఎసరొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతం ఒక టాప్ డైలాగ్ రైటర్ ఇదే విషయంలో తెగ ఫీల్ అవుతున్నారట.
రీసెంట్ గా అయన ఒక భారీ సినిమాకు పని చేశారు. ఇంకా రిలీజ్ కాలేదు లెండి. అయితే ఈయన ఎంత నంబర్ వన్ డైలాగ్ రచయిత అయినా ఈయన పనిని సవ్యంగా చేయనివ్వకుండా అందరూ ఫుల్లుగా ఫింగరింగ్ చేశారట.. అదే.. అన్ని వేళ్ళు పెట్టారట. దీంతో అంత పెద్ద సినిమాకు పని చేశానన్న ఆనందం కాస్త ఆవిరయిందట. ఆ సినిమాకు ఒక్క డైలాగ్ కూడా సరిగా తనను రాయనివ్వలేదని తన సన్నిహితుల దగ్గర ఆ రచయిత తెగ వాపోయారట. గతంలో కూడా ఆయన ఇదే హీరో సినిమాకు ఈ రచయత చేస్తే సేమ్ టు సేమ్ జరిగిందట! దీంతో హీరోపై.. దర్శకుడిపై ఈ రైటర్ గుర్రుగా ఉన్నారని ఫిలింనగర్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.
అంతే కాదు.. సదరు రచయత ఆవేదనలో అర్థం ఉందని.. ఎందుకంటే ఆయన పని చేసిన సినిమా ప్రోమోస్ లో ఉన్న డైలాగ్స్ లో ఆ వాడివేడి లేవని కూడా ఇండస్ట్రీవారు అంటున్నారు. ఒకవేళ ఇది నిజమే అయితే 'పెద్ద రైటర్ అయితే ప్రెజర్ ఉండదని.. ఇబ్బందులు ఉండవని' అనుకోవడం శుద్ధ తప్పు. ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్టు.. అందరికీ వారికి తగ్గ సమస్య ఉంటుందని మనం సరిపెట్టుకోవాలేమో!