రెండు నెలలు 300 కోట్లు.. టాలీవుడ్ టార్గెట్

Update: 2016-07-17 04:01 GMT
2016 ఫస్టాఫ్ ముగిశాక రెండు సగం ప్రారంభం టాలీవుడ్ కి అంత గొప్పగా లేదు. బాక్సాఫీస్ ని కళకళలాడించే సినిమా ఏదీ రావడం లేదు. అయితే.. రాబోయే రెండు నెలలు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా ముఖ్యం. ఈ సమయంలో 300 కోట్ల రూపాయల బిజినెస్ చేసేందుకు సినిమాలు సిద్ధమవుతున్నాయి.

ఈ నెల 22న కబాలితో సీజన్ ప్రారంభం కానుండగా.. భారీ సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా అనేకం క్యూ కడుతున్నాయి. ఆ తర్వాతి వారంలో సునీల్ నటించిన జక్కన్న కూడా జూలై 29న విడుదల కానుంది. మోహన్ లాల్ నటించిన మనమంతా చిత్రాన్ని ఆగస్ట్ 5న విడుదల చేయబోతున్నారు. షూటింగ్ పూర్తయినా జనతా గ్యారేజ్ తో పోటీ పడ్డం ఇష్టం లేక ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. రెండు సినిమాల్లోనూ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించడమే ఇందుకు కారణం. అయితే.. ఎన్టీఆర్ మూవీ సెప్టెంబర్ 2కి వాయిదా పడ్డంతో.. దీన్ని ఆగస్ట్ 5న విడుదల చేయనున్నారు. అల్లు శిరీష్ హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో రూపొందిన శ్రీరస్తు శుభమస్తు కూడా ఆగస్ట్ 5నే రిలీజ్ చేయనున్నట్లు గీతా ఆర్ట్స్ ప్రకటించింది.

ఆగస్ట్ 12న వెంకటేష్ మారుతీల కాంబినేషన్ లో రూపొందిన బాబు బంగారం విడుదల కానుండగా.. ఆగస్ట్ 13న హ్యాట్రిక్ హీరో సాయిధరం తేజ్ మూవీ తిక్కను షెడ్యూల్ చేశారు. ఇవి కాక మరికొన్ని చిన్న సినిమాలు కూడా విడుదల కావాల్సి ఉంది. అన్నీ కలిపి కనీసం 300 కోట్ల బిజినెస్ చేస్తేనే బాక్సాఫీస్ కళకళలాడుతుంది.
Tags:    

Similar News