టామ్ క్రూజ్.. హాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. సిక్స్‌టీ ఇయర్స్‌కి దగ్గరవుతున్నప్పటికీ రిస్కీ స్టంట్లతో ఫ్యాన్స్ ను అలరిస్తూనే ఉన్నాడు. పర్ఫెక్షన్ కోసం నిత్యం తపించే ఈ హాలీవుడ్ స్టార్.. ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో వస్తున్న ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ షూట్‌లో బిజీగా ఉన్నారు. ఎప్పుడూ తన మార్కు యాక్షన్‌తో ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేసే టామ్ క్రూజ్‌కి ఒక్కసారిగా కోపం వచ్చింది. తన క్రూ మీద ఫైర్ అయిన హీరో.. మళ్లీ రిపీట్ అయితే.. ఉద్యోగాలు ఊడిపోతాయని వార్నింగ్ ఇచ్చారు.
మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో 7, 8 సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ షూట్ చేయాలని పక్కాగా ప్లాన్ చేసుకున్నారు డైరెక్టర్ క్రిస్టోఫర్ మెక్ క్వారీ. కానీ.. కరోనా ఇబ్బంది పెట్టింది. లాక్‌డౌన్ తర్వాత మొదలైన 7 సిరీస్ షూటింగ్ ను శరవేగంగా కొనసాగిస్తున్నారు. అయితే.. పర్ఫెక్షన్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాని టామ్ క్రూజ్.. మిషన్ ఇంపాజిబుల్ మూవీ టీమ్ మీద మండిపడ్డారు. దీనికి సంబంధించిన ఆడియో టేప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సెట్‌లో టీం సభ్యులు కరోనా జాగ్రత్తలను సరిగా పాటించకపోవడమే క్రూజ్ కోపానికి కారణమట. ‘అసలే లాక్‌డౌన్ వల్ల సినిమా ఇండస్ట్రీ కోట్లాది రూపాయలు నష్టపోయింది. చాలా మంది రోడ్డు మీదకి వచ్చేశారు. కానీ.. మనం టైమ్‌కి తిండి తినగలుగుతున్నాం. అది గుర్తు పెట్టుకుని పనిచెయ్యండి. నేను ఎప్పుడూ రెస్పాన్సిబుల్‌గా ఉంటాను. కాబట్టి, నా టీమ్ కూడా బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటాను. పని విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించను. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే.. ఉద్యోగాలు ఊడ దీస్తాను’.. అని ఫుల్లుగాా క్లాస్ తీసుకున్నారట టామ్.
మిషన్ ఇంపాజిబుల్ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్‌గా ఉన్నాడు క్రూజ్.. కాబట్టి నిర్మాత వ్యవయ ప్రయాసలేంటో మొత్తం తెలుసు. క్రూ లో ఎవరికైనా కరోనా వస్తే.. అది మరింతగా వ్యాాపిస్తే షూట్ పై ప్రభావం పడుతుందన్నది టామ్ ఆందోళన కావచ్చు. నిజానికి అది అర్థం చేసుకోవాల్సిన విషయమే. మిషన్ ఇంపాజిబుల్ 7 మూవీని వాస్తవానికి 2021 జూన్ 23 న రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్‌తో నవంబర్ 19, 2021 కి పోస్ట్‌పోన్ అయ్యింది. అందుకే అంతగా యూనిట్ మీద కోప్పడి ఉండొచ్చు ఈ యాక్షన్ హీరో.