స్పైడర్ మ్యాన్ కొరియోగ్రాఫర్ తో సైరా

Update: 2017-08-23 06:04 GMT
100 కోట్లతో నిర్మిస్తున్న సినిమా అంటే.. 100 రకాలు కాదు 1000 రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బాహుబలి 2 వంటి సినిమా రిజల్ట్ చూసిన తరువాత తప్పకుండా ఆ జాగ్రత్తలన్నీ బాగా వర్కవుట్ అవుతాయి. అందుకే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా రూపొందుతున్న 'సైరా' సినిమా కోసం భారీ స్థాయిలో పండిపోయిన టెక్నీషియన్లను తీసుకున్నారు. అంతేకాదు.. ఒక హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కూడా రంగంలోకి దిగినట్లు ఈరోజు ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. టోని చింగ్ అనే హాలీవుడ్ యాక్షన్ సినిమాటోగ్రాఫర్ తో ఇప్పుడు సైరా యుద్ద సన్నివేశాలను కంపోజ్ చేయిస్తున్నారట. హాలీవుడ్ లో స్పైడర్ మ్యాన్ మన బాలీవుడ్లో క్రిష్‌ సినిమాలకు ఇతన స్టంట్స్ కంపోజ్ చేశాడు. కాని వాటన్నింటికంటే చెప్పుకోదగిన సినిమాలు ఏంటంటే.. హౌస్ ఆఫ్‌ ఫ్లయ్యింగ్ డాగర్స్ లో మనోడి పనితనం అద్భుతంగా ఉంటుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గుర్రంపై వచ్చి బ్రిటీష్ సైనికులతో జరిపే సెమీ-మోడ్రన్ యుద్దవిన్యాశాలకు ఇటువంటి హాలీవుడ్ స్థాయి కొరియోగ్రాఫర్లు అయితే బెటర్ గా ఉంటుందని ఫీలయ్యాడట సురేందర్ రెడ్డి. అదే విషయాన్ని రామ్ చరణ్‌ కు చెప్పి ఒప్పించాడట. ఆ విధంగా టోని చింగ్ ను రంగంలోకి దించారు.

మొత్తానికి అడుగడుగునా మెగాస్టార్ 151వ సినిమాను మరింత ఘనంగా గొప్పగా తీర్చిదిద్దేందుకు ఇలా టాప్ టెక్నీషియన్లను ఎంచుకుని ముందుకు వెళుతున్నారనమాట. అసలు ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చాక మా రీసెర్చ్ పవర్ ఏంటో మీకు తెలుస్తుంది అంటున్నడు సురేందర్ రెడ్డి. చూద్దాం మరి!!
Tags:    

Similar News