అజార్ ని అలా మార్చి తీసేశారట

Update: 2016-04-09 07:30 GMT
హైద్రాబాద్ క్రికెటర్ - టీమిండియా కెప్టెన్ అజారుద్దీన్ జీవిత చరిత్ర ఇప్పుడు సినిమాగా రూపు దిద్దుకుంటోంది. టోనీ డిసౌజా దర్శకత్వంలో అజార్ అనే టైటిల్ పై రూపొందిన ఈ చిత్రం.. ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాని ఓ జీవిత చరిత్ర అనుకుని తీయలేదని, సినిమాకి సంబంధించి ఏమేం ఎలిమెంట్స్ ఉండాలో అన్నీ ఉండేలా మార్చుకుని తీశానంటున్నాడు దర్శకుడు.

'నేను ఈ విషయంలో ముందునుంచి క్లారిటీనే ఉన్నాను. ఎక్కువ మందికి సంబంధం ఉన్న చిత్రం, అలాగే ఎక్కువమంది చూడాల్సిన చిత్రం. అందుకే వాస్తవాలను మార్చేయకుండా, వాటిని ఇంట్రెస్టింగ్ గా సినిమా స్టైల్ లో ట్విస్టులు జోడించి తీసే ప్రయత్నం చేశాను. సినిమాకు కావాల్సిన అన్ని మసాలాలు జోడించాము' అంటున్నాడు టోనీ డిసౌజా.

రియల్ లైఫ్ స్టోరీని యథాతథంగా ఎవరూ తీయరన్నది ఈయన వాదన. ఇప్పటివరకూ వచ్చిన వాటిలో చాలావరకూ బయోపిక్ లు మన మధ్య లేని వాళ్లవే. కానీ ఇది మాత్రం మన మధ్యే ఉన్న వ్యక్తికి సంబంధించిన స్టోరీ. ఇలాంటి మూవీ అజార్ ని డైరెక్ట్ చేసే అవకాశం రావడం నా అదృష్టం అంటున్నాడు టోనీ. ఈ మూవీ ప్రమోషన్లలో అజారుద్దీన్ కూడా పాల్గొననుండడం విశేషం.
Tags:    

Similar News