#NTR క్యూలో టాప్ 10 డైరెక్ట‌ర్స్

Update: 2022-02-03 04:31 GMT
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన 29వ సినిమా ఆర్.ఆర్.ఆర్ మార్చి 25న అత్యంత భారీగా విడుద‌ల‌వుతోంది. ఈ సినిమా త‌ర్వాత తారక్ లైన‌ప్ ప‌రిశీలిస్తే షాకిస్తోంది. అత‌డు ఇప్ప‌టికే టాప్ 10 డైరెక్ట‌ర్ల‌ను క్యూలో ఉంచార‌నేది ఫిలింన‌గ‌ర్ టాక్.

రాజ‌మౌళితో ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ బ‌రిలో ఉంది. ఆ త‌ర్వాత కొర‌టాల శివ‌తో ఎన్టీఆర్ 30 ప్రారంభం కానుంది. అటుపైనా తార‌క్ లైన‌ప్ అసాధార‌ణంగా ఉంది. ఉప్పెన ఫేం బుచ్చిబాబు స‌న‌- కేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్- అట్లీ- త్రివిక్ర‌మ్- సంజ‌య్ లీలా భాన్సాలీ- వేట్రి మార‌న్- త‌రుణ్ భాస్క‌ర్- సుకుమార్ - లోకేష్ క‌న‌గ‌రాజ్- రాజ‌మౌళి వంటి దిగ్గ‌జాల‌తో ప‌ని చేయ‌నున్నారు. ఇందులో త‌రుణ్ భాస్క‌ర్ మాత్ర‌మే నేటిత‌రం ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ కాగా.. ఇత‌రులంతా సీనియ‌ర్లు.

తార‌క్ టాప్ 10 డైరెక్ట‌ర్స్ జాబితా ప‌రిశీలిస్తే..!

కెరీర్ 30వ సినిమాని త‌న స్నేహితుడు కొర‌టాల శివ‌తో చేస్తున్నాడు. అలాగే కెరీర్ 35వ సినిమాని బాలీవుడ్ క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు భ‌న్సాలీతో చేయ‌నున్నారు. ల్యాండ్ మార్క్ మూవీ ఎన్టీఆర్ 40 కోసం తిరిగి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి బ‌రిలోకి దిగుతార‌న్న‌మాట‌. ఎన్టీఆర్ 29 కోసం ప‌ని చేసిన రాజ‌మౌళి తిరిగి ఎన్టీఆర్ 40వ సినిమా కోసం  మీట‌వుతార‌న్న‌మాట‌.

ద‌ర్శ‌కుల లిస్ట్ ఇదే..!

ఎన్టీఆర్ 30 - కొర‌టాల శివ‌
ఎన్టీఆర్ 31- ఉప్పెన బుచ్చిబాబు
ఎన్టీఆర్ 32 - కేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్
ఎన్టీఆర్ 33 - అట్లీ
ఎన్టీఆర్ 34 - త్రివిక్ర‌మ్
ఎన్టీఆర్ 35 - సంజ‌య్ లీలా భ‌న్సాలీ
ఎన్టీఆర్ 36 - వేట్రి మార‌న్
ఎన్టీఆర్ 37 - త‌రుణ్ భాస్క‌ర్
ఎన్టీఆర్ 38 - సుకుమార్
ఎన్టీఆర్ 39 - లోకేష్ క‌న‌గ‌రాజ్
ఎన్టీఆర్ 40- రాజ‌మౌళి
Tags:    

Similar News