టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నారు. కానీ వారిలో చాలా తక్కువ మంది మాత్రమే రెగ్యులర్ గా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఒకొక్క సంవత్సరం ఒకొక్క హీరోయిన్ జోరు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఏడాదిలో రష్మిక మందన్నా.. సమంత.. పూజా హెగ్డే తో పాటు మృణాల్ ఠాకూర్ లు మాత్రమే సందడి చేశారు.
కీర్తి సురేష్ ఆ మధ్య సర్కారు వారి పాట సినిమా తో వచ్చినా కూడా ఆ తర్వాత పెద్దగా సందడి చేయలేదు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కూడా ఏమీ లేవు. రష్మిక మరియు పూజా హెగ్డేలు మాత్రమే స్టార్ హీరోలకు కనిపిస్తున్న ఆప్షన్. వారిద్దరుతో పాటు మృణాల్ కూడా మరో ఆప్షన్ గా మారింది. మరో వైపు పెద్ద నిర్మాణ సంస్థలు పెద్ద దర్శకులు లేడీ ఓరియంటెడ్ సినిమాల కోసం సమంత వైపు చూస్తున్నారు.
ఈ నలుగురు టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ జాబితాలో వచ్చే ఏడాదికి మార్పు వచ్చే అవకాశాలు లేకపోలేదు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ నలుగురిలో టాప్ స్టార్ ఎవరు అంటే మాత్రం ఠక్కున సమాధానం చెప్పే పరిస్థితి లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.
పారితోషికం పరంగా చూసుకుంటే ఒకరు.. హిట్స్ పరంగా చూసుకుంటే మరొకరు అన్నట్లుగా వీరికి టాప్ ప్లేస్ లు దక్కుతాయి. ఈ నలుగురు హీరోయిన్స్ కూడా కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళం మరియు హిందీ భాషల్లో కూడా వరుసగా సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
వీరు కాకుండా టాలీవుడ్ టాప్ హీరోలకు జోడీగా దీపిక పదుకునే.. ఆలియా భట్ వంటి బాలీవుడ్ స్టార్స్ కూడా జోడీగా నటిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు లో బాలీవుడ్ హీరోయిన్స్ నటించడం అనేది చాలా అరుదుగా జరిగేది. కానీ ఇప్పుడు మాత్రం బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగు సినిమాల్లో చాలా కామన్ విషయంగా మారింది. అందుకే ఇక్కడి స్టార్ హీరోయిన్స్ కు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ స్టార్ హీరోల సినిమాల్లో దక్కడం లేదు.
సమంత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకు పోయే ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో ఆమె హిందీలో ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేయబోతుంది. మృణాల్ ఠాకూర్ కూడా వరుసగా సినిమాలు చేయాలని తెలుగు ఫిల్మ్ మేకర్స్ కోరుకుంటున్నారు. రష్మిక మరియు పూజా హెగ్డేలు తెలుగు లో పలు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఎవరికి వారే టాప్ కనుక ఈ హీరోయిన్స్ లో నెం.1 ఈమె అని చెప్పడానికి లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.