గతేడాది సూపర్ స్టార్ రజనీకాంత్ `అన్నాతై` తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. అన్నా-చెల్లి సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమా అనూహ్య విజయాన్ని అందుకుంది. కోలీవుడ్ బాక్సాఫీస్ నే 200 కోట్ల వసూళ్లతో షేక్ చేసింది. రొటీన్ జానర్ అని విమర్శకులు పెదవి విరిచేసినా మరోసారి సూపర్ స్టార్ ఇమేజ్ తో విజయ ఢంకా మోగించారు.
తెలుగు లో `పెద్దన్న` టైటిల్ తో అనువాదమైంది. కానీ ఇక్కడ సక్సెస్ అవ్వలేదు. మూస కంటెంట్ అనే విమర్శల్ని మూటగట్టుకుంది. ఇక `అన్నాతై` తర్వాత రజీనీ ఇంకా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించలేదు. ఇంకా విశ్రాంతిలోనే ఉన్నారు. రాజకీయాల్లోకి ఎలాగూ రావడం లేదని క్లారిటీ వచ్చేసింది.
ఉన్న జీవితాన్ని సినిమాకే అంకితం చేసేసినట్లు ప్రకటించడంతో సూపర్ స్టార్ వెండి తెర అభిమానులకు పండగే. మరికొన్నాళ్ల పాటు సూపర్ స్టార్ ని తెరపై చూసుకునే అవకాశం అభిమానులకు దక్కింది. ప్రస్తుతం రజనీకాంత్ తదుపరి ప్రాజెక్ట్ కి సంబంధించి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రజనీ రెడీ అయ్యారు. ఇది రజనీకాంత్ 168వ సినిమా. ఈ సినిమా తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 169వ చిత్రాన్ని లాక్ చేసారు. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలోగానీ..చివర్లో గానా రిలీజ్ చేయాలని భావిస్తున్నారుట.
ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ 170వ చిత్రం కోసం ఏకంగా ఇద్దరు దర్శకులు పోటీ పడుతున్నారుట. ఆ ఇద్దరి పేర్లు బయటకు రాలేదు గానీ..పోటీ మాత్రం తీవ్రంగానే ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు దర్శకుల కథల్ని రజనీ విన్నారుట. కంటెంట్ పరంగా ఏదీ తక్కువ కాదని రజనీ సైతం ఏది లాక్ చేయాలని డైలమాలో పడ్డట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. 170వ నెంబర్ కి పక్కా మ్యాచ్ అయ్యే స్ర్కిప్ట్ లని టాక్ వినిపిస్తోంది. అయితే లోకేష్ కనగరాజ్ తో ఓ సినిమా చేయాలని అప్పట్లో రజనీ బహిరంగంగానే అన్నారు.
మరి ఆ ఇద్దరిలో ఒకరిగా లోకేష్ కనగరాజ్ అవడానికి అవకాశం ఉంది. ఇక పా రంజిత్ కూడా గతంలో సూపర్ స్టార్ కి ఓ స్ర్కిప్ట్ వినిపించారు. `కబాలి`..`కాలా` తర్వాత సూపర్ స్టార్ తో హ్యట్రిక్ చిత్రాన్ని తీయాలని ప్లాన్ చేసారు. కానీ `కాలా` ఫెయిల్యూర్ తో రజనీ ఆసక్తి చూపించలేదు. మరి అటుపై రజనీ మనసు మారి రంజిత్ 170 రేసులో ఉంటే ఆశ్చర్యకరమే. ప్రస్తుతం రజనీకాంత్ డిస్టబెన్స్ లో ఉన్నారు. ఆయన కుమార్తె ఐశ్యర్య-ధనుష్ లు విడిపోవడంతో రజనీ మానసిక ఇబ్బందుల్లో ఉన్నారు.