యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ''థాంక్యూ'' సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది. దిల్ రాజు నిర్మాణంలో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో చై కెరీర్ లోనే అతిపెద్ద పరాజయంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సాధించిన విజయాల వెనుక ఎంతో మంది ప్రోత్సాహం, తోడ్పాటు ఉంటుంది. అలాంటి వారిని కలుసుకుని ధన్యవాదాలు చెప్పాలని తెలియజెప్పాలనే కథాంశంతో ''థాంక్యూ'' సినిమా. అభిరామ్ అనే ఓ ముప్పై ఐదేళ్ల వ్యక్తి జీవితంలోని మూడు ముఖ్య దశల ఎమోషనల్ జర్నీని ఇందులో ఆవిష్కరించారు. నాగచైతన్య మూడు విభిన్నమైన పాత్రల్లో ఒదిగిపోయాడు.
మంచి లైన్ తీసుకున్నప్పటికీ.. చెప్పాలనుకున్న విషయాన్ని ప్రేక్షకులను ఆకట్టుకునేలా చెప్పడంలో విఫలం అవ్వడంతో 'థాంక్యూ' సినిమా ఇలాంటి ఫలితాన్ని అందుకుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ రిజల్ట్ ఎలా ఉన్నా ఓటీటీలో మాత్రం కచ్చితంగా హిట్ అవుతుందని లెజండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ అంటున్నారు.
'థాంక్యూ' సినిమాకు సినిమాటోగ్రఫీ అందించిన పీసీ శ్రీరామ్ ట్వీట్ చేస్తూ.. ''ఇది హిట్ లేదా ఫెయిల్యూర్ గురించి కాదు. ఓటీటీ మైండ్ సెట్ లోకి వచ్చింది. 'థాంక్యూ' అనే పదం ఓటీటీలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. విమర్శలు గౌరవించబడతాయి.. అంగీకరించబడతాయి. ఓటీటీ 3 రెట్లు ఎక్కువ మందికి చేరుతుంది. భారీ థాంక్యూ. కానీ నో థాంక్యూ ఇంకా థాంక్యూ కాదు'' అని పేర్కొన్నారు.
నిజానికి 'థాంక్యూ' సినిమాని ముందు నుంచీ పెద్దగా ప్రమోట్ చేయలేదు. రిలీజ్ కు ముందు మాత్రం నిర్మాత దిల్ రాజు తన చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేసారు. కానీ అది కూడా సాధారణంగా తన ఇతర చిత్రాల కంటే తక్కువనే చెప్పాలి.
ఇక 'థాంక్యూ' ఫస్ట్ డే టాక్ బయటకు వచ్చిన తర్వాత దిల్ రాజు ఎక్కడా కనిపించలేదు. రిలీజ్ తర్వాత సినిమా గురించి స్పందించలేదు. నష్టాన్ని కంట్రోల్ చేయడానికి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు.
డైరెక్టర్ విక్రమ్ కుమార్ మరియు హీరో నాగచైతన్య ఎప్పటిలాగే సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. హీరోయిన్ రాశీఖన్నా - రైటర్ బివిఎస్ రవి కూడా ఆఫ్ లైన్ లోకి వెళ్లిపోయారు. కానీ ఒక్క పీసీ శ్రీరామ్ మాత్రమే 'థాంక్యు' చిత్రాన్ని మొదటి నుంచీ చివరి వరకూ ప్రమోట్ చేస్తూ వస్తున్నారని చెప్పాలి.
చైతూ సినిమా అప్డేట్ ఇవ్వడం లేదని అక్కినేని ఫ్యాన్స్ గొడవ చేస్తున్నప్పుడు.. వర్కింగ్ స్టిల్స్ షేర్ చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ వచ్చారు.
'థాంక్యూ' సినిమా పట్ల పీసీ శ్రీరామ్ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నట్లు ప్రమోషన్స్ లో దిల్ రాజు తెలిపారు. ఇక సినిమాకు మిశ్రమ స్పందన వచ్చిన తర్వాత కూడా తన ట్వీట్స్ తో సానుకూలతను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చారు లెజండరీ కెమెరామెన్. మరి ఆయన ఆశించినట్లు 'థాంక్యూ' సినిమా ఓటీటీలో మంచి స్పందన తెచ్చుకుంటుందేమో చూడాలి.