టాప్ స్టోరి: య‌ంగ్ హీరోల‌కు మ‌హ‌ర్ధ‌శ‌

Update: 2019-11-01 17:30 GMT
సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎద‌గాలంటే సినీ నేప‌థ్యం ఉండాలా? అంటే అవ‌స‌రం లేద‌ని ప్రూవ్ అవుతోంది.  బ్యాగ్రౌండ్ లేక‌పోతే ఈ రంగంలో నిల‌బ‌డ‌టం అంత ఈజీ కాక‌పోయినా ఆల్ట‌ర్నేట్ క‌నిపిస్తోందిప్పుడు. ప‌లువురు యంగ్ హీరోలు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేక‌పోయినా ప్ర‌తిభ‌తో అంద‌లం అందుకున్నారు. అలాంటి వారి జాబితాని వెతికితే ఆస‌క్తిక‌ర సంగతులే తెలిశాయి. తెలుగు-త‌మిళ‌- క‌న్న‌డ‌- హిందీ భాష‌ల్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వ‌చ్చి అద్భుతాలు సృష్టిస్తున్న యువ‌ హీరోలు చాలా మందే వున్నారు. అందులో ఈ మ‌ధ్య కాలంలో తెలుగులో మొద‌ట చెప్పుకోవాల్సిన స్టార్లు నాని- విజ‌య్ దేవ‌ర‌కొండ -నిఖిల్‌.

వీళ్ల‌కు ఏమాత్రం సినీ నేప‌థ్యం లేదు. క‌ష్ట‌ప‌డి పైకొచ్చారు. పేరు సంపాదించారు. శేఖ‌ర్ క‌మ్ముల చిత్రం `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌` సినిమాలో సాధాసీదా పాత్ర‌లో మెరిసిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఆ త‌రువాత `ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం`తో న‌టుడిగా త‌నేంటో నిరూపించుకున్నాడు. `అర్జున్‌రెడ్డి`తో స్టార్ అయిపోయి టాలెంట్ వుంటే ఎలాంటి బ్యాగ్రౌండ్ అవ‌స‌రం లేద‌ని నిరూపించాడు. త‌న‌తో పాటు సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా మ‌హ‌ర్ద‌శ ప‌ట్టిన కుర్ర హీరోలు చాలా మందే వున్నారు. బాపు- ర‌మ‌ణ‌ల `రాధా గోపాలం`కు క్లాప్ బోర్డ్ బాయ్‌గా పని చేసిన నాని కెరీర్ `అష్టాచ‌మ్మా` సినిమాతో మ‌లుపుతిరిగింది. ఇంద్ర‌గంటి వేసిన పునాదితో ఇప్పుడు మినిమ‌మ్ గ్యారంటీ హీరోగా ఎదిగాడు. స్టార్ హీరో రేంజుకు అత‌డు ఎదిగేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు.

`హ్యాపీడేస్‌`తో శేఖ‌ర్ క‌మ్ముల‌ స్కూల్ నుంచి వ‌చ్చిన నిఖిల్ కు కూడా ఎలాంటి సినీ నేప‌థ్యం లేదు. టాలెంట్ తో యంగ్ హీరోల్లో ప్ర‌త్యేక‌మైన గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో స్కైలోకి దూసుకెళ్లిన అడివి శేష్ కేవ‌లం విదేశాల్లో ఫిలింస్ట‌డీస్ చేసి ఇక్క‌డ రాణిస్తున్నాడు. గూఢ‌చారి-క్ష‌ణం చిత్రాల‌తో అత‌డి రేంజు స్కైని ట‌చ్ చేసింది. మునుముందు అగ్ర బ్యాన‌ర్ల‌లో సినిమాలు చేస్తున్నాడు. మ‌హేష్ నిర్మిస్తున్న చిత్రంలోనూ అత‌డు పాన్ ఇండియా హీరోగా న‌టిస్తున్నాడు. దేవ‌ర‌కొండ‌తో క‌లిసి న‌టుడిగా మొద‌లైన విశ్వ‌క్ సేన్ సైతం సినీ బ్యాగ్రౌండ్ తో ప‌ని లేకుండా దూసుకొస్తున్నాడు. ఫ‌ల‌క్ నుమా దాస్ త‌ర్వాత‌ ప్ర‌స్తుతం నాని నిర్మాణ సార‌థ్యంలో రెండో సినిమా చేస్తున్నాడు. త‌మిళంలో సాధార‌ణ యాంక‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన శివ‌కార్తికేయ‌న్ ఇప్పుడు అక్క‌డ నోట‌బుల్ హీరో. ఎక్క‌డో దుబాయ్ లో అకౌంటెంట్ గా ప‌నిచేసిన విజ‌య్ సేతుప‌తి ఇప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల‌కు మ‌క్క‌ల్ సెల్వ‌న్‌. ఎదురేలేని స్టార్ హీరోగా రాణించాడు. తెలుగులో విల‌న్ గా పాపుల‌ర‌వుతున్నాడు.

క‌న్న‌డంలో రాకెట్‌లా దూసుకొచ్చి `కేజీఎఫ్‌`తో పాన్ ఇండియా స్టార్ అయిన హీరో య‌ష్‌. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానుల్ని సంపాదించుకున్నాడు. డ్రైవ‌ర్ కొడుకు స్టార్ డ‌మ్ కి అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. సంగీత ద‌ర్శ‌కుడు విజ‌య్ ఆంటోనిదీ అదే తీరు. ఏ సినీనేప‌థ్యం లేక‌పోయినా సంగీత ద‌ర్శ‌కుడిగా ఎదిగి హీరో అయ్యాడు. బిచ్చ‌గాడు చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి ఆ త‌ర్వాత డ‌జ‌ను పైగా చిత్రాల్లో హీరోగా న‌టించాడు. నిర్మాత‌గానూ ఎదిగాడు. ఇటీవ‌ల ల‌క్ క‌లిసి రాక వెన‌క‌బ‌డ్డాడు కానీ అత‌డు అనుకున్న‌ది సాధించాడు. బోన‌స్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. త‌మిళ క‌మెడియ‌న్ సంతానం సినీనేప‌థ్యం లేకుండా  ఆ స్థాయిని అందుకోవ‌డం ఓ సంచ‌ల‌నం. త‌మిళ‌-క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో ప‌లువురు హీరోలు ఈ త‌ర‌హాలో రాణిస్తున్నారు.

హిందీలో విక్కీకౌశ‌ల్- ఆయుష్మాన్ ఖురానా- రాజ్‌కుమార్ రావు- సిద్ధార్థ్ మ‌ల్హోత్రా వీళ్ళంతా సినీ నేప‌థ్యం లేకుండా కేవ‌లం టాలెంట్ ని న‌మ్ముకుని పైకి వ‌చ్చిన వాళ్లే. `యూరి` సినిమాతో విక్కీ కౌశ‌ల్ స్టార్ డ‌మ్ అసాధార‌ణంగా పెరిగింది. మార్కెట్ అత‌డిపై భారీ బెట్టింగ్ చేస్తోంది. ఒక ప్ర‌త్యేక జోన‌ర్ క‌థ‌ల్ని ఎంచుకుని త‌న స్టార్ డ‌మ్ ని పైపైకి తీసుకెళుతున్నాడు ఆయుష్మాన్ ఖురానా. విక్కీ డోన‌ర్ మొద‌లు నిన్నటి బ్లాక్ బ‌స్ట‌ర్ డ్రీమ్ గర్ల్ వ‌ర‌కూ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో దూసుకొచ్చాడు. ప్ర‌స్తుతం అమితాబ్ తో క‌లిసి ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టిస్తున్నాడు. మాస్ యాక్ష‌న్ సినిమాల‌తో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా దూసుకెళుతున్నాడు. అత‌డు న‌టించిన మ‌ర్జావాన్ ఈనెల 22న‌ రిలీజ్ కి వ‌స్తోంది.
Tags:    

Similar News