టాప్ స్టోరి: టాలీవుడ్ టాప్ 5 పాన్ ఇండియా హీరోలు

Update: 2022-04-06 12:30 GMT
చూస్తుండ‌గానే అంతా మారిపోయింది! బాహుబ‌లి ముందు బాహుబ‌లి త‌ర్వాత!! అన్న చందంగా తెలుగు సినిమా హ‌వా న‌డుస్తోంది. టాలీవుడ్ స్కై ఈజ్ లిమిట్ అన్న తీరుగా భారీ పాన్ ఇండియా చిత్రాల్ని తెర‌కెక్కిస్తోంది. మ‌న‌కు ఇప్ప‌టికిప్పుడు అర‌డ‌జ‌ను మంది పాన్ ఇండియా స్టార్లు ఉన్నారు. వీరంతా ఇక‌పై బాలీవుడ్ హీరోల‌కు కూడా గ‌ట్టి పోటీనివ్వ‌నున్నార‌ని సంకేతం అందింది.

ఖాన్ ల వ‌య‌సైపోయింది. వీళ్ల ప‌నైపోయింద‌న్న చ‌ర్చ కూడా ఉంది. ఖిలాడీలు కుమార్ లు ధావ‌న్ లు ఉన్నా కానీ  రేసులో ఇక‌పై మ‌న టాప్ హీరోల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్క‌డ ఎవ‌రికి ఉండేది వారికి ఉంది! సౌత్ నుంచి వ‌చ్చే హీరోల్ని ఇంకా కొంద‌రు బాలీవుడ్ హీరోలు త‌క్కువ అంచ‌నా వేస్తున్నారు. జాన్ అబ్ర‌హాం లాంటి వాళ్ల‌ను వ‌దిలేస్తే.. మారిన స‌న్నివేశం ఖాన్ ల‌కు కూడా అర్థ‌మ‌వుతోంది. ఎక్క‌డైనా మాట్లాడే ముందు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మునుప‌టిలా కాదు.. టాలీవుడ్ పెద్ద హీరోల‌ గురించి జాగ్ర‌త్త‌గా మాట్లాడాల్సి ఉంద‌ని స‌న్నివేశం అర్థం చేసుకున్నారు.

అన్న‌ట్టు తెలుగులో ఎంత‌మంది పాన్ ఇండియా స్టార్లు ఉన్నారు? అన్న‌ది ఆరా తీస్తే.. అంద‌రూ అంద‌రే.. ఎవ‌రికి వారే పాన్ ఇండియా స్టార్లు. అయితే ముఖ్యంగా రేసులో ఉన్న‌ది మాత్రం అర‌డ‌జ‌ను మంది. యంగ్ ఎన‌ర్జిటిక్ ట్యాలెంటెడ్ హీరోల‌లో ప్రభాస్- రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్- అల్లు అర్జున్ - విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్ప‌టికే పాన్ ఇండియా రేసులో ఉన్నారు. సీనియ‌ర్ హీరోల్ని వ‌దిలేస్తే.. త‌దుప‌రి మ‌హేష్‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్ పాన్ ఇండియా రేసులో చేరుతున్నారు. ప్ర‌భాస్ -చ‌ర‌ణ్‌-ఎన్టీఆర్- బ‌న్ని ఇప్ప‌టికే నిరూపించ‌గా ఇత‌రులు నిరూపించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు.

ఇక స‌ర్కార్ వారి పాట త‌ర్వాత రాజ‌మౌళితో భారీ పాన్ ఇండియా చిత్రంలో న‌టించేందుకు సూప‌ర్ స్టార్ మ‌హేష్ సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ తో అత‌డి రేంజు అమాంతం మార‌నుంది. పాన్ ఇండియా రేస్ లో అతడి పేరు మార్మోగ‌నుంది. ఇక చ‌ర‌ణ్ ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత వెంట‌నే శంక‌ర్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ తో పాన్ ఇండియా సినిమా చేస్తుండ‌డం అత‌డి మైలేజ్ ని అమాంతం పెంచ‌నుంది. త‌దుప‌రి కేజీఎఫ్ డైరెక్ట‌ర్ తోనూ చెర్రీ సినిమా చేయ‌నున్నాడు. మ‌రోవైపు ఎన్టీఆర్ సైతం కేజీఎఫ్ డైరెక్ట‌ర్ తో సినిమా చేసేందుకు ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నాడు.

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం కేజీఎఫ్ డైరెక్ట‌ర్ తో స‌లార్ చిత్రం చేస్తున్నాడు. అలాగే ఆదిపురుష్ 3డి లాంటి భారీ పాన్ ఇండియా చిత్రం .. సైన్స్ ఫిక్ష‌న్ చిత్రం చేస్తుండ‌డంతో అత‌డి రేంజు స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా ఉంది. ఇక యంగ్ హీరోల్లో లైగ‌ర్ చిత్రంతో పాన్ ఇండియా రేస్ లోకి చేరుతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా పాన్ ఇండియా రేస్ లోకి రానున్నాడు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు పాన్ ఇండియా టార్గెట్ గానే విడుద‌ల కానుంది. అయితే ఇటీవలి కాలంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ ల్యాణ్ వ‌రుస‌గా రీమేక్ చిత్రాల‌కు అంగీక‌రించ‌డంతో ప‌రిధి కాస్త త‌గ్గింద‌ని విశ్లేషిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైరా-న‌ర‌సింహారెడ్డి త‌ర్వాత రీమేక్ ల‌పై దృష్టి సారించ‌డం కూడా ర‌క‌ర‌కాల విశ్లేష‌ణ‌ల‌కు తావిస్తోంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ల‌క్ష్యం పాన్ ఇండియానే. నాని - శ‌ర్వానంద్ లాంటి హీరోలు తెలుగు-త‌మిళంలో బొమ్మ ఆడించే ఆలోచ‌న‌తోనే కెరీర్ ని సాగిస్తున్నారు. కేవ‌లం అగ్ర హీరోలే కాదు..మిడ్ రేంజ్ హీరోలు.. చిన్నా చిత‌కా హీరోలు కూడా ఇటీవలి కాలంలో పాన్ ఇండియా స్క్రిప్టుల్ని ఎంచుకుని ప్ర‌యోగాలకు దిగుతున్నారు. కొడితే కుంభాన్నే కొట్టాలి అన్న భావ‌న అంత‌కంత‌కు టాలీవుడ్ లో బ‌ల‌ప‌డుతోంది. యూనివ‌ర్శ‌ల్ కాన్సెప్టుల్ని పురాణ క‌థ‌ల్ని ఎంపిక చేసుకుని స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. మాఫియా క‌థ‌లు.. బందిపోటు క‌థ‌లు ఇత‌ర‌త్రా క‌థ‌ల‌తోనూ స‌త్తా చాటేందుకు బ‌రిలో దిగుతున్నారు.
Tags:    

Similar News