పలానా పేర్లు అంటూ టివి ఛానల్స్ ప్రకటించేశాయి. కాదు పలానా పేర్లు అంటూ వేరెవ్వరో చెప్పేశారు. కాని ఒక్క పేరు కూడా మేం అసలు బయటకే చెప్పలేదు అంటున్నారు ఎక్సయిజ్ డిపార్టమెంట్ అధికారులు. అయితే కొందరు నటులు మాత్రం మాకు నోటీసులు వచ్చాయని.. కొందరు మాత్రం మాకు రాలేదని క్లారిటీ ఇచ్చేశారు. వీరిలో ఎవరు నిజం ఎవరు అబద్దం అనేది పక్కనెట్టస్తే.. అసలు ఇంకొన్ని బిగ్ ఫిష్ లు కూడా ఈ డ్రగ్స్ స్కాండల్ లో ఉన్నాయంటూ కొత్త రూమర్లు వినిపిస్తున్నాయి.
కాస్త పోష్ గా కనిపిస్తూ.. ప్లే బాయ్స్ అనే ట్యాగ్ ఉన్న ఓ ఇద్దరు యంగ్ స్టర్స్ ఈ రాకెట్లో ఉన్నారంటూ రూమర్లు వచ్చాయి. వారి తండ్రేమో ఒక బడా ప్రొడ్యూసర్. ఆయనకు తెలియకుండా టాలీవుడ్ లో ఒక్క రీలు కాదు కదా.. సింగిల్ ఫ్రేము కూడా ఎక్కడికీ కదలదు అనేంత రేంజ్ ఆయనది. అయితే సడన్ గా ఆయన కొడుకులు కూడా ఉన్నారని.. వారి పేరును తప్పించారని టాక్ రావడంతో.. సదరు సీనియర్ ప్రొడ్యూసర్ వాపోతున్నాడు. ''అసలు నా కొడుకులు ఇలాంటి వాటిలో లేనేలేరు. వారేదో కాస్త పోష్ గా ఉంటారు కాబట్టి కావాలనే ఇలాంటి వాటిలో ఇరికిస్తున్నారు. టిఆర్పీ కోసం వారి మీద కథనాలు వేస్తున్నారు. ఇది చాలా తప్పు'' అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
ఏదేమైనా కూడా.. డ్రగ్స్ గుట్టులో ఏది నిజమో ఏది అబద్దమో తెలియదు కాని.. వీరున్నారంటే వారున్నారని.. వారున్నారంటే వీరున్నారని.. ఇప్పుడు మీడియాలో యుట్యూబ్ లో తెగ కథనాలు వినిపిస్తున్నాయి. అది సంగతి.