సౌత్‌లో నంబర్ -1 డైరెక్టర్ ఎవరు? శంకర్, ఎస్.ఎస్.రాజమౌళి .. ఈ ఇద్దరిలో ఎవరికి మీ ఓటు? ఈ ప్రశ్న వేస్తే సమాధానం చెప్పడం ఇప్పుడు కష్టమేమీ కాదు. అయితే ప్రభాస్ చెప్పినట్టు ఒకే ఒక్క సినిమాతో నెం.1ని నిర్ణయించడం కరెక్ట్ కాదు. అయితే ఈ ఇద్దరూ టాప్ థ్రోన్ కు అర్హులే. దక్షిణాదిన ఉన్న టాప్ డైరెక్టర్స్‌లో ఒకరితో ఒకరు పోటీపడే సత్తా ఉన్న దర్శకులు వీళ్లే.
కెరీర్ పరంగా చూస్తే శంకర్ స్పాన్ చాలా పెద్దది. రోబో వంటి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అతడు. జెంటిల్‌మేన్, భారతీయుడు నుంచి సినిమా సినిమాకి స్థాయిని పెంచుకుంటూ అసాధారణ ఫీట్ వేసిన దర్శకుడిగా శంకర్ క్రేజు అమోఘమైనది. అయితే ఇప్పుడు ఆ స్థాయిని అందుకున్న దర్శకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి పేరు వినిపిస్తోంది. అంతేకాదు ప్రముఖుల నుంచి శంకర్‌ని మించిన స్థాయికి ఎదిగాడన్న ప్రశంసలు దక్కుతున్నాయి. బాహుబలి సాధిస్తున్న వసూళ్లు చూస్తే ఇప్పట్లో వేరే ఏ దర్శకుడు కూడా అతడిని కనీసం టచ్ కూడా చేయలేడనే అనిపిస్తోంది.
దేశంలో రాజ్‌కుమార్ హిరాణీ తర్వాత అంతటి క్రేజీయెస్ట్ డైరెక్టర్‌గా రాజమౌళికి క్రేజు పెరిగింది. దక్షిణాదిన తిరుగులేని దర్శకుడిగా గుర్తింపు వచ్చేసినట్టే. రాజమౌళిని ప్రస్తుతానికి నెం.1 అంటే తప్పేమీ కాదు. అయితే శంకర్ 'రోబో-2' తో మళ్లీ రాజమౌళి రికార్డుల్ని కొట్టేస్తాడేమో చూడాలి. ఇప్పటికైతే రోబో-2, బాహుబలి-2 సరికొత్త రికార్డుల రేసులోకి వచ్చే సినిమాలుగా గుర్తింపు పొందాయి