వసూళ్ళ వాసి మొదటి రోజు అంచనాలు

Update: 2018-01-09 06:08 GMT
ఎక్కడ చూసినా అజ్ఞాతవాసి ఫీవర్ కమ్ముకుని ఉంది. ఏ నలుగురు కలిసినా ఈ సినిమా ఎప్పుడు చూస్తున్నావ్ అనే టాక్ తోనే మొదలవుతోంది. ఒక కమర్షియల్ సినిమాకు ఇంత హైప్ రావడం ఈ మధ్య కాలంలో జరగలేదు. దీనికి కారణం పవర్ స్టార్ బ్రాండ్ అని అందరు ఒప్పుకున్నప్పటికీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ టచ్ హైప్ రెట్టింపు కావడానికి తోడ్పడింది. ఇక అందరి చూపు ఫస్ట్ డే కలెక్షన్స్ పైనే ఉంది. పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి దక్కిన వెసులుబాటు - వారం రోజుల పాటు అదనపు షోలు వేసుకోవడానికి దొరికిన అనుమతి తదితర కారణాలు భారీ వసూళ్లు రాబట్టేందుకు మార్గం సుగమం చేసాయి. ఒక్క మొదటి రోజే 40 కోట్లకు పైగా షేర్ సాధిస్తుంది అని పవన్ ఫాన్స్ నమ్మకంతో ఉన్నారు. ట్రేడ్ కూడా అదే అంచనాలలో ఉంది.

ఓవర్సీస్ లో పవన్ కున్న క్రేజ్ దృష్ట్యా మొదటి రోజు లేదా మహా అంటే రెండో రోజు డబుల్ మిలియన్ మార్క్ దాటడం పక్కా అని చెబుతున్నారు. కర్ణాటకలో సైతం పది కోట్లకు పైగా బిజినెస్ జరుపుకున్న అజ్ఞాతవాసి ఫిక్స్డ్ హైర్ రూపంలో ఇప్పటికీ మూడున్నర కోట్లు వెనక్కు ఇచ్చేసింది. అడ్వాన్సు బుకింగ్ జరుగుతున్న తీరు చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. టాక్ ఎలా ఉన్నా ఫస్ట్ వీక్ మొత్తం పవన్ స్పీడ్ కు బ్రేకులు పడవు. మరీ బాలేదు అంటే తప్ప యావరేజ్ గా ఉన్నా పట్టం కట్టడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనక ఇక ఆపడం ఎవరి తరం కాదు. అదే కనక జరిగితే ఫైనల్ గా 150 కోట్ల మార్క్ అందుకోవడం కష్టమేమి కాదు. మరికొద్ది గంటల్లో తేలబోయే అజ్ఞాతవాసి సత్తా కలెక్షన్ రూపంలో ఎంత ఉండవచ్చు అనేది రేపు ఈ టైంకల్లా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News