స్టార్‌ సింగర్ మృతితో ఇండస్ట్రీ లో విషాదం

Update: 2022-04-30 12:42 GMT
సినీ ప్రేమికులకు మరియు సంగీత ప్రియులకు మరో చేదు వార్త. బాలీవుడ్‌ స్టార్ పాప్‌ సింగర్ తర్సామీ సింగ్ సైనీ అనారోగ్యంతో కన్ను మూశారు. జానీ జీ గా దేశ వ్యాప్తంగా పాప్ ప్రియులకు సుపరిచితుడు అయిన తర్సామీ సింగ్‌ సైనీ ఎన్నో సినిమా లకు తన గాత్రం అందించాడు. అలాంటి జానీ జీ మృతి పట్ల అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 ఆయన గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. ప్రస్తుతం యూకే లో ఉన్న ఆయన అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు. చాలా కాలంగా హెర్నియా సమస్యతో జానీ జీ బాధ పడుతున్నారట. ఆ విషయం ను గతంలోనే కుటుంబ సభ్యులు వెళ్లడించారు. ఆ హెర్నియాకు ఆపరేషన్‌ చేయాల్సి ఉంది.

ఆపరేషన్ చేయాలనుకున్న సమయంలో కరోనా బారిన ఆయన పడ్డారు. దాంతో ఆపరేషన్ కాస్త ఆలస్యం అయ్యింది. ఆ ఆపరేషన్‌ ఆలస్యం అవ్వడం వల్లే జానీ జీ మృతి చెంది ఉంటారు అనేది బాలీవుడ్‌ వర్గాల వారి అభిప్రాయం. అయితే ఇప్పటి వరకు జానీ జీ మృతికి కారణం ఏంటీ అనే విషయం లో అధికారిక స్పష్టత మాత్రం కరువయ్యింది.

డోంట్‌ స్టాఫ్‌ డ్రీమింగ్ మరియు సాంబార్ సల్సా సినిమాలతో గాయకుడిగా జానీ జీ ప్రేక్షకులకు సింగర్ గా పరిచయం అయ్యాడు. కోయి మిల్‌ గయా.. రేస్‌ వంటి సినిమాలు ఆయన్ను స్టార్‌ గా నిలిపాయి. 1989 లో హిట్‌ ది డేక్ ఆల్బమ్‌ తో ఈయన జాతీయ స్థాయిలో గుర్తింపును దక్కించుకున్నారు.

యూకే లో ఎంతో మంది సంగీత కళాకారులతో కలిసి ఈయన ప్రదర్శణ లు ఇచ్చే వారు. ఎన్నో సూపర్ హిట్‌ ఆల్బం లకు తన గాత్రంను ఇచ్చారు. అలాంటి గొప్ప సింగర్ ను కోల్పోవడంతో ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్ర్బాంతిని వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News