ట్రైలర్ టాక్ః ఈ ‘టెడ్డీ’బేర్ ఆడుకునేది కాదు.. మనుషుల్ని వేటాడేది!
కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య - డైరెక్టర్ శక్తి సౌందర్ రాజన్ కాంబోలో రాబోతున్న తమిళ్ మూవీ 'టెడ్డీ'. స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా, ఆధనా జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను మంగళవారం రిలీజ్ చేశారు మేకర్స్.
కోమాలో ఉన్న వారికి బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదనేది మనందరికీ తెలిసిన విషయం. అయితే.. కొన్ని సమయాల్లో, కొందరికి బయటి ప్రపంచంతోనూ రిలేషన్ ఉండే ఛాన్స్ ఉంటుందట. అలాంటి ఓ మనిషి ఆత్మ టెడ్డీ బేర్ లో చేరి, మెడికల్ మాఫియాపై హీరో సాగించే పోరాటంలో భాగస్వామి అవుతుందని అనిపిస్తోంది ఈ ట్రైలర్ చూస్తుంటే!
మొత్తానికి ఈ ట్రైలర్ ద్వారా.. తన సినిమాలో టెడ్డీ బేర్ కూడా మరో హీరో అని చెప్పేశాడు దర్శకుడు. టెడ్డీ బేర్ లో మనిషి ఆత్మ ఉంటుంది కాబట్టి.. అది ఎలా మాట్లాడుతుంది..? ఎలా ప్రవర్తిస్తుంది..? ఏం చేస్తుంది? అన్నదానిపై ఆడియన్స్ కు క్యూరియాసిటీ ఎక్కువగా బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ప్రకారం చూస్తే.. హీరో కన్నా, ప్రేక్షకుల దృష్టి టెడ్డీ బేర్ మీదనే ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
మాఫియాలపై హీరోలు పోరాడడం సాధారణ విషయమే అయినా.. ఓ టెడ్డీ బేర్ ఈ విషయంలో ప్రముఖ పాత్ర పోషించడం అనేది ప్రత్యేకం. కాబట్టి, ఈ టెడ్డీని డీల్ చేసిన విధానమే.. సినిమా సక్సెస్ ను డిసైడ్ చేస్తుందని కూడా చెప్పొచ్చు. ఈ సినిమాలో ఆర్య సరసన సయేషా నటించింది. మాగిజ్ తిరుమేని, సతీష్, కరుణకరన్, మసూమ్ శంకర్, సాక్షి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించారు.కాగా.. ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్త డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మార్చి 12 నుండి స్ట్రీమింగ్ కాబోతోందీ 'టెడ్డీ'.
Full View