మహేష్ కెరీర్ 26వ సినిమా `సరిలేరు నీకెవ్వరు` ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ సహా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం కశ్మీర్ నుంచి ఆంధ్రాకు పయనమయ్యే ట్రైన్ సెట్ లో కీలక సీన్స్ ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ రైలు సెట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
రన్నింగ్ ట్రైన్ లో రొమాంటిక్ సన్నివేశాల్ని తెరకెక్కించేందుకు అనీల్ రావిపూడి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ట్రైన్ సెట్ నిర్మాణం జరుగుతోంది. ఇక ఈ ట్రైన్ లో తెరకెక్కించే సన్నివేశాలకు వీఎఫ్ ఎక్స్ మాయాజాలాన్ని ఎటాచ్ చేయనున్నారని తెలుస్తోంది. అంటే రన్నింగ్ ట్రైన్ లో రొమాన్స్- కామెడీతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలం హైలైట్ గా నిలవనుందట. ఈ సన్నివేశాల్లో మహేష్ - రష్మిక మందన సహా ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటారని తెలుస్తోంది.
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2020 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అన్నట్టు ట్రైన్ ఎపిసోడ్ అనగానే శ్రీనువైట్ల తెరకెక్కించిన `వెంకీ` సినిమా గుర్తుకు రావాల్సిందే. అయితే ఆ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఇమేజ్ కి తగ్గట్టు పూర్తి కామిక్ టైమింగ్ తో 30 నిమిషాల ట్రైన్ ఎపిసోడ్ రక్తి కట్టిస్తుంది. సరిలేరు నీకెవ్వరు ట్రైన్ ఎపిసోడ్ లోనూ కామెడీతో పాటు రొమాన్స్ అదిరిపోయేలా సీన్స్ ని ప్రిపేర్ చేశారని తెలుస్తోంది.