కామెంట్: గతి మార్చేసిన నాలుగు బ్లాక్ బస్టర్లు

Update: 2016-11-29 03:46 GMT
ఈ ఏడాది టాలీవుడ్ లో హిట్ రేషియే ఎక్కువగానే ఉంది. 11 నెలలు పూర్తవుతుండగా ఇప్పటికే 16 సినిమాలు హిట్ కానీ.. అంతకు మించి కానీ అడేశాయి. అంటే ప్రతీ రెండు నెలలకు మూడు సూపర్ హిట్స్ పడ్డాయన్న మాట. సరైనోడు.. జనతా గ్యారేజ్ రూపంలో రెండు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. సర్దార్.. బ్రహ్మోత్సవం లాంటి ఆల్ టైం ఫ్లాపులను కూడా ఈ ఏడాది చూడాల్సి వచ్చింది.

అయితే.. హిట్స్ విషయానికి వస్తే.. బ్లాక్ బస్టర్స్ అనదగ్గ సినిమాలు నాలుగు వచ్చాయి. మొదటగా నాగార్జున మూవీ సోగ్గాడే చిన్ని నాయన. డిఫరెంట్ కేరక్టరైజేషన్ తో.. నాగార్జునను ఓ ఆత్మ పాత్రలో చూపిస్తూ కూడా.. బ్లాక్ బస్టర్ కొట్టడం విశేషం. పెట్టుబడికి 3 రెట్లకు పైగా వసూలు చేసిందీ సినిమా. ఆ తర్వాత అడల్ట్ కామెడీ జోనర్ లో వచ్చిన ఈడో రకం ఆడో రకం కూడా బ్లాక్ బస్టర్ల కోటాలోకే  వెళ్లింది. కంప్లీట్ గా కామెడీ కంటెంట్ కావడం కలిసొచ్చే విషయమైతే.. మంచు విష్ణు-రాజ్ తరుణ్ ల కాంబో కామెడీని ఆడియన్స్ బాగానే ఎంజాయ్ చేశారు.

ఆ తర్వాత పెళ్లి చూపులు చిత్రం గురించి చెప్పాల్సిందే. పెట్టుబడికి ఎన్నో రెట్లు లాభాలను పట్టుకొచ్చి.. చిన్న సినిమాల్లో పెద్ద హిట్ కొట్టింది ఈ చిత్రం. తాజాగా పది రోజుల క్రితం వచ్చిన నిఖిల్ మూవీ ఎక్కడికి పోతావు చిన్నవాడా కూడా బ్లాక్ బస్టర్స్ అకౌంట్లోకి వెళ్లిపోయింది. సూపర్ నేచురల్ పవర్స్ కాన్సెప్ట్ లో వచ్చిన ఈ థ్రిల్లర్ కి ప్రేక్షకులు జయహో పలుకుతుంటే.. డీమానిటైజేషన్ దెబ్బ నుంచి టాలీవుడ్ ను బయటకు తీసుకచ్చాడు చిన్నవాడు.

ఇక్కడో విషయం చెప్పుకోవాలి. స్టార్ హీరోలు ప్రయోగాలు చేయచ్చని నిరూపించిన సినిమా సోగ్గాడే చిన్నినాయన. కంటెంట్ కొత్తగాను స్ట్రాంగ్ గాను ఉంటే.. ఇక్కడే కాదు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ వసూళ్లు అందుకోలేనంత లక్ష్యేమేమీ కాదని చెప్పింది పెళ్లిచూపులు. కామెడీ పండాలి.. టైమింగ్ కుదరాలి కానీ.. అడల్ట్ కామెడీతో బ్లాక్ బస్టర్ కొట్టచ్చని చూపించిన మూవీ ఈడోరకం ఆడో రకం. ఇక సూపర్ నేచురల్ పవర్ తో తక్కువ బడ్జెట్ లో అందరినీ అలరించేలా ఎక్కడికి పోతావు చిన్నవాడాను తీసి.. బ్లాక్ బస్టర్ కొట్టేశాడు నిఖిల్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News