ట్రెండీ స్టోరి: స్టార్ హీరోల సొంత బ్యాన‌ర్ల వెన‌క

Update: 2021-05-23 07:40 GMT
టాలీవుడ్ లో స్టార్ హీరోలంతా సొంత బ్యాన‌ర్ల‌ను క‌లిగి ఉన్నారు. ఇత‌ర బ్యాన‌ర్ల‌తో క‌లిసి భాగ‌స్వామ్య విధానంలో సినిమాల్ని నిర్మిస్తున్నారు. త‌ద్వారా త‌మ‌కు పారితోషికాన్ని మించి లాభాల్లో వాటాలు ద‌క్కుతున్నాయి. అదంతా ఒక ఎత్తుగ‌డ అనుకుంటే త‌మ తోబుట్టువులు బంధుమిత్రుల‌తో బ్యాన‌ర్లు ప్రారంభించి వాటి ద్వారా లాభాల్లో వాటాలు పొందే వాళ్లు ఉన్నారు.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ జీఎంబీ బ్యాన‌ర్ ని ప్రారంభించి ఇత‌ర బ్యాన‌ర్ల‌తో క‌లిసి సినిమాలు నిర్మిస్తున్నారు. తద్వారా లాభాల్లో వాటాల‌తో పాటు భారీ ప్యాకేజీలు అందుకుంటున్నారు. మ‌హేష్ త‌న సోద‌రి మంజుల‌.. సోద‌రుడు ర‌మేష్ వంటి వారిచే మైన‌ర్ పెట్టుబ‌డులు పెట్టిస్తున్నారు. త‌ద్వారా వారికి అంతో ఇంతో ఆదాయం సాధ్య‌మ‌వుతోంది.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. వీట‌న్నిటినీ అన్న‌గారు క‌ళ్యాణ్ రామ్ సొంత బ్యాన‌ర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తోంది. కొర‌టాల‌తో సినిమాని యువ సుధ ఆర్ట్స్ తో క‌లిసి క‌ళ్యాణ్ రామ్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది. అదేవిధంగా పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ -ఎన్టీఆర్ కలయికతో మైత్రి మూవీ మేకర్స్ ఒక చిత్రాన్ని ప్రకటించారు. కళ్యాణ్ రామ్- ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ సినిమాని భాగ‌స్వామ్యంలో నిర్మిస్తోంది.

డార్లింగ్ ప్ర‌భాస్ స్నేహితుల‌తో క‌లిసి యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ని ర‌న్ చేస్తున్నారు. సొంతంగా గోపికృష్ణ మూవీస్ బ్యాన‌ర్ ఉంది. అల్లు అర్జున్ తన సినిమాల్లో తన బంధువులు లేదా స్నేహితులను భాగస్వాములుగా చేర్చుకున్నాడు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ లో చిరంజీవి హీరోగా చ‌ర‌ణ్ సినిమాలు నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో క‌జిన్స్ పెట్టుబ‌డులు స‌మ‌కూరుస్తార‌ని గుస‌గుస‌లు ఉన్నాయి.
Tags:    

Similar News