ట్రెండీ టాక్‌: హీరోల‌పై నిర్మాత‌ల మైండ్ గేమ్

Update: 2019-11-04 14:55 GMT
సెంటిమెంటు ప‌రిశ్ర‌మ‌లో స‌క్సెస్ ఉంటేనే ఏదైనా. స్టార్ డ‌మ్ ని బట్టే బిజినెస్. స‌క్సెస్ రేటును బ‌ట్టే పారితోషికం ఒప్పందాలు. పెద్ద‌ స్టార్ అయినా త‌న మార్కెట్ స్థాయిని బ‌ట్టే ఒప్పందాలు సాగుతున్నాయి. నిర్మాత రోడ్డున ప‌డ‌కుండా ఇప్పుడు ఓ కొత్త గేమ్ న‌డుస్తోంది.

మునుప‌టితో పోలిస్తే హీరోల పారితోషికాల విష‌యంలో నిర్మాత‌లు చాలా తెలివిగా ముందుకెళ్తున్నారు. ప్ర‌స్తుత‌ నిర్మాత‌లు కాస్త ప‌క్కా ప్లానింగ్ తో ఉన్నార‌నిపిస్తొంది. మారిన‌ వ్యాపార స‌ర‌ళి అందుకు అద్దం ప‌డుతోంది. పెట్టిన పెట్టుబ‌డి రిలీజ్ కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో వ‌చ్చేస్తోంది. దీంతో నిర్మాత సేఫ్ జోన్ లో ఉంటున్నాడు. ఇది కేవ‌లం స‌క్సెస్ లో ఉన్న హీరోతో సాధ్యం. మ‌రి స‌క్సెస్ లేని హీరోల ప‌రిస్థితి ఏమిటి? అంటే అందుకు నిర్మాతలు ఓ తెలివైన చిట్కా క‌నిపెట్టారు.

తాజా ఎగ్జాంపుల్స్ ప‌రిశీలిస్తే.. ఓ స్టార్ హీరో ఓ నిర్మాత‌తో సినిమా చేసేందుకు క‌మిట్ అయ్యాడు. స‌ద‌రు  నిర్మాత ఆ హీరో ప్రీ రిలీజ్ బిజినెస్ కి లింకు పెట్టాడు. చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన త‌ర్వాత ఆ హీరో మార్కెట్ ని బ‌ట్టి బ్యాలెన్స్ రెమ్యున‌రేష‌న్ క్లియ‌ర్ చేస్తాన‌ని అగ్రిమెంట్ చేసుకున్నారు. తాజాగా మ‌రో నిర్మాత క‌మ్ డైరెక్ట‌ర్ ఇటీవ‌లే ఓ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు  క‌మిట్ అయ్యాడ‌ట‌. స‌ద‌రు హీరో వ‌రుస ప్లాప్ ల‌ని ముందే ప‌సిగ‌ట్టిన ద‌ర్శ‌క నిర్మాత‌లు రూపాయి పారితోషికం ఇవ్వ‌కుండానే తెలివిగా అగ్రిమెంట్ పై సైన్ చేయించారుట‌. సినిమా పూర్త‌యిన త‌ర్వాత జ‌రిగే బిజినెస్ ని బ‌ట్టి అవ‌స‌రమైతే రూపాయి ఎక్కువే ఇస్తాం కానీ త‌క్కువ చేయ‌మ‌ని అగ్రిమెంట్ చేసుకున్నారుట‌.

నిజానికి ఇది ప‌రిశ్ర‌మ‌లో కొత్త‌ పోక‌డే అనాలి. ముందే హీరోల‌కు కోట్లాది రూపాయ‌ల పారితోషికం దోచి పెట్ట‌డం కంటే... సినిమా బిజినెస్ రేంజును బ‌ట్టి రెమ్యున‌రేష‌న్ డిసైడ్ చేస్తే నిర్మాత‌కు మేలు జ‌రుగుతోంది. పంపిణీ దారుల‌కు అందుబాటు ధ‌ర‌ల్లో రిలీజ్ హ‌క్కులు దొరుకుతాయి. రిలీజ్ విష‌యంలో హీరోకి బాధ్య‌త పెరుగుతోంది. ఏదేమైనా నిర్మాత‌లు గ‌తం క‌న్నా వ‌ర్త‌మ‌నంలో అంత గుడ్డిగా లేర‌న్నది మాత్రం వాస్త‌వం.
Tags:    

Similar News