ట్రెండీ టాక్‌: ఇంత‌కీ సామ్ ఎవ‌రిని తిట్టిన‌ట్టు?

Update: 2021-04-15 10:46 GMT
సుత్తి లేకుండా సూటిగా తిట్టేయాలి! అనుకుంటే దానికి మొహ‌మాట ‌ప‌డాల్సిన‌ అవ‌సరం లేదు. అవ‌త‌లి వారికి అర్థ‌మ‌య్యేలా తిట్టేస్తే స‌రి. ఈ ఫార్ములాని అనుస‌రించ‌డంలో క‌ర్ర విర‌గ‌కుండా .. అందాల క‌థానాయిక స‌మంత ప్ర‌ద‌ర్శించిన‌ తెలివితేట‌ల్ని ప‌దిమందీ ప్ర‌శంసిస్తున్నారు.

నిజానికి చాలా మీడియాలు ఫ‌లానా న‌టి ఫ‌లానా విధంగా మాట్లాడింది అంటూ త‌ప్పు ప‌ట్టి రాసేయ‌డం స‌మంత‌కు న‌చ్చ‌దు. దానికి ప్ర‌తిస్పంద‌న‌గానే తెలివైన కౌంట‌ర్ వేశారు మీడియాపై. సెల‌బ్రిటీలు అయినా కానీ మేం కూడా మ‌నుసులమే క‌దా.. త‌ప్పు చేస్తే అలా సిలువ వేసేయడం ఎందుకు? అని సమంత నిల‌దీశారు. సమంత కాస్త గ‌ట్టిగా మ‌రింత‌ స్పష్టంగానే అడిగేసినందుకు చాలా మంది అభిమానులు ‌ స్నేహితులు ప్రశంసించారు.

ఇన్ ‌స్టా వేదిక‌గా ఓ వీడియో ద్వారా సామ్ గ‌ట్టిగానే ప్ర‌శ్నించారు.``మేము ఎంటర్ టైనర్స్.. ఫాక్ట్ చెకర్స్ కాదు. ప్రపంచానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి అభిప్రాయాన్ని చెబితే వెంట‌నే నటులను ఎందుకు సిలువ వేస్తారు? మేము కూడా మనుషులమే. మేము కూడా తప్పులు చేస్తాము`` అయితే దేనిపై అయినా గట్టిగా మాట్లాడినా లేదా మాట్లాడ‌క‌పోయినా.. మమ్మల్ని దూరం పెట్టేయ‌డం అన్యాయం. మేం బాగా న‌టిస్తే. మా ప్రదర్శనలతో మీరు ప్రేమలో పడతారు. మా మ‌న‌సులో ఉన్న‌ది మాట్లాడేయ‌డమే మాకు తెలుస్తుంది. ఇదే మంచి మార్గం`` అని సామ్ అన్నారు.

చిత్ర పరిశ్రమకు చెందిన వివిధ ప్రముఖులు సమంతను ఈ విష‌యంలో తెగ పొగిడేస్తున్నారు.  ప్రగ్యా జైస్వాల్ `హా.. లవ్ ఇట్`` అని రాశారు. యామి గౌతమ్ `స్పాట్ ఆన్!` అని వ్యాఖ్యానించారు. సింగర్ చిన్మయి స‌హా ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపించారు. చూస్తుంటే సామ్ ని ఎవ‌రో తీవ్రంగానే గాయ‌ప‌రిచిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. మ‌రీ ఇంత ఘాటుగా రిప్ల‌య్ ఇవ్వ‌డం వెన‌క కార‌ణ‌మేంటో త‌నే చెప్పాలి. సామ్ న‌టించిన ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2 సిరీస్ కోసం అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాసేలా వేచి చూస్తున్నారు. గుణ‌శేఖ‌ర్ శాకుంత‌లంకి మ‌హ‌మ్మారీ వ‌ల్ల‌ చిన్న‌పాటి బ్రేక్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News