అంజలి ప్రధాన పాత్రలో నటించిన హార్రర్ కామెడీ ‘గీతాంజలి’కి ముందు ఏవరేజ్ టాక్ వచ్చింది. కానీ ఆ సినిమా బాగానే ఆడింది. నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఐతే థియేటర్లలో ఆడిందానికంటే కూడా బుల్లితెరపైన గీతాంజలి మరింత బాగా ఆడటం విశేషం. స్టార్ హీరోల సినిమాల స్థాయిలో దీనికి టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. దాదాపు 16 రేటింగ్ రావడమంటే చిన్న విషయం కాదు. గత ఏడాది బుల్లెతరపై సూపర్ హిట్ అయిన సినిమాల్లో ఇదొకటి. ఈ సినిమాను రూపొందించిన కొత్త దర్శకుడు రాజ్ కిరణ్ తన రెండో ప్రయత్నంగా మళ్లీ హార్రర్ కామెడీనే ట్రై చేస్తున్నాడు. ఆ సినిమానే త్రిపుర.
కలర్స్ స్వాతి ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు కోన వెంకటే స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. గీతాంజలి ఎఫెక్ట్ వల్ల ఈ సినిమాకు బిజినెస్ కూడా బాగానే జరుగుతోంది. అంతే కాదు.. విడుదల తేదీ కూడా ఇంకా ఖరారవకుండానే శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడైపోవడం విశేషం. ‘గీతాంజలి’ రైట్స్ తీసుకున్న టీవీ ఛానెలే ‘త్రిపుర’ను కూడా కొనుక్కుంది. రేటు కూడా బాగానే వచ్చిందని సమాచారం. ఈ మధ్య చిన్న సినిమాలకు శాటిలైట్ అవడం చాలా కష్టమవుతోంది. సినిమా రిజల్ట్ చూశాక కానీ ఛానెల్స్ ముందు రావట్లేదు. ఇంతకుముందు సినిమాల కోసం ఛానెల్స్ పోటీ పడేవి కానీ.. ఇప్పుడు సినిమాల వాళ్లే రైట్స్ అమ్మడానికి ఛానెల్స్ ని దేబిరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ‘త్రిపుర’ రిలీజ్ డేట్ కూడా ఖరారవకుండానే శాటిలైట్ అయిపోయి సంచలనం సృష్టించింది.