దాదాపు దశాబ్దంన్నరగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది త్రిష. గ్లామరస్ రోల్స్ చాలా చేసింది కానీ.. ఏ రోజూ కూడా హద్దులు దాటలేదు. అవకాశాలు తగ్గిపోతున్న టైంలో కూడా లిమిట్స్ లోనే ఉంది చెన్నై చిన్నది. ఐతే ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా గ్లామర్ గేట్లు తెరిచేసింది. ఈ శుక్రవారం తమిళ - తెలుగు భాషల్లో విడుదల కాబోతున్న ఆరణ్మయి-2/కళావతి సినిమాలో త్రిషను ఇంతకుముందెన్నడూ చూడని అవతారాల్లో చూడబోతున్నామని ట్రైలర్స్ చూస్తుంటే అర్థమైపోతోంది. ఈ సినిమాలో త్రిష బికినీ ధరించడం విశేషం. హార్రర్ కామెడీ సినిమాలో ఈ బికినీ విందేంటో అర్థం కావడం లేదు. అంతే కాదు.. సిద్ధార్థ్ తో కలిసి ఓ పాటలో క్లీవేజ్ షోలతో అదరగొట్టిందని కూడా తెలుస్తోంది.
సాధారణంగా హార్రర్ కామెడీల్లో హీరోయిన్ల అందాల మీద పెద్దగా ఫోకస్ పెట్టరు. వాటి ప్రమోషన్ కూడా ఇంకో రకంగా ఉంటుంది. ఐతే ‘కళావతి’లో మాత్రం గ్లామర్ డోస్ బాగా ఉన్నట్లు కనిపిస్తోంది. త్రిషతో పాటు హన్సిక - పూనమ్ బజ్వా కూడా తమదైన శైలిలో అందాల ప్రదర్శన చేసినట్లున్నారు. ఇప్పటికే పోస్టర్లలో వీళ్ల టాలెంట్ చూపించారు. ఐతే మామూలుగా అయితే త్రిష కంటే హన్సిక - పూనమ్ అందాల ప్రదర్శనలో ముందుంటారు. కానీ ఈ సినిమా వరకు త్రిష వాళ్లను డామినేట్ చేయాలని డిసైడైనట్లుంది. గత ఏడాది తెలుగులో ‘చంద్రకళ’ పేరుతో విడుదలైన ‘ఆరణ్మయి’కి ఇది రీమేక్. ఖుష్బూ హజ్బెండ్ సుందర్.సి దర్శకుడు. ఈ సినిమాలో అతను కూడా ఓ ముఖ్య పాత్ర పోషించాడు.