వరుణ్ మణియన్.. గత ఏడాది ఈ పేరు దక్షిణాది మొత్తం మార్మోగింది. స్టార్ హీరోయిన్ త్రిషతో ఎంగేజ్మెంట్ చేసుకున్న తమిళ నిర్మాత ఇతను. నిర్మాతగా ఉన్నపుడు అతడి గురించి ఎవరికీ పెద్ద పట్టింపు లేదు. ఐతే త్రిష బాయ్ ఫ్రెండ్ అన్న ట్యాగ్ వచ్చాక అతను వార్తల్లో వ్యక్తి అయిపోయాడు. త్రిషతో ఎంగేజ్మెంట్ చేసుకోవడం.. ఆమెతో పాటు తన స్నేహితుల్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకెళ్లి అక్కడ టూర్ వేసి రావడంతో వరుణ్ బాగానే పాపులారిటీ సంపాదించాడు. కానీ త్రిషతో అతడి ప్రేమాయణం మూణ్నాళ్ల ముచ్చటే అయింది. ఎంగేజ్మెంట్ కూడా అయ్యాక అతడితో బ్రేకప్ చేసుకుంది త్రిష. ఇందుకు కారణాలేంటన్నది వెల్లడి కాలేదు.
వరుణ్‌తో బ్రేకప్ తర్వాత త్రిష సినిమాల్లో బిజీ అయిపోగా.. అతను తెలుగమ్మాయి అయిన బిందు మాధవితో ఎఫైర్ మొదలుపెట్టినట్లుగా వార్తలొచ్చాయి. ఆమెనే పెళ్లాడతాడని కూడా అన్నారు. కానీ ఆ బంధం కూడా ముందుకు వెళ్లలేదు. ఐతే ఇప్పుడు వరుణ్ మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు సమాచారం. కనిక అనే అమ్మాయితో అతడికి పెళ్లి జరగబోతోందట. అక్టోబర్‌లోనే ఈ వేడుక ఉంటుందట. కనిక వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి అంటున్నారు. తన ఫొటోలు కూడా మీడియాలోకి వచ్చేశాయి.
మరి వరుణ్ తన తోడును వెతుక్కున్నాడు సరే.. త్రిష సంగతేంటి అన్న చర్చ నడుస్తోంది కోలీవుడ్‌లో. వరుణ్ తో ప్రేమాయణం మొదలయ్యే సమయానికి త్రిష కెరీర్ ముగిసిపోయేలా కనిపించింది. కానీ అతడితో బ్రేకప్ తర్వాత అనూహ్యంగా ఆమెకు అవకాశాలు పెరిగాయి. ప్రస్తుతం తమిళంలో ఆమె నాలుగు సినిమాలు చేస్తుండటం విశేషం. కెరీర్ డల్లయ్యాక కానీ త్రిష పెళ్లి గురించి ఆలోచించేలా లేదు. సినిమాల విషయంలో అభ్యంతర పెట్టడం వల్లే త్రిష వరుణ్ కు దూరమైనట్లుగా ఓ ప్రచారం ఉంది. కాబట్టి ఆమె కెరీర్ కు అభ్యంతరం చెప్పని వాడినే పెళ్లాడుతుందేమో.