పదేళ్ల కెరీర్ లో స్టార్ హీరోలతో చాలా సినిమాలే చేసింది త్రిష, భారీ బడ్జెట్ సినిమాలు బోలెడు కెరీర్ లో ఉన్నా.. ప్రస్తుతం కమల్ హాసన్ చేస్తున్న తూంగావనం, తెలుగులో చీకటి రాజ్యం విజయం చాలా ముఖ్యం ఈ సీనియర్ హీరోయిన్ కి. తన లైఫ్ లో మొదటిసారిగా పోలీస్ పాత్రను పోషిస్తుండడం బాగా ఎగ్జయిట్ అవుతోందీ బ్యూటీ. తూంగావనం తన కెరీర్ లో స్పెషల్ గా మిగిలిపోనుందని.. ఈ మూవీకి సైన్ చేశాక.. పలు మంచి స్క్రిప్టులు - ఆఫర్లు వస్తున్నాయని త్రిష చెప్పింది.
నెల రోజుల వ్యవధిలోనే ఈ చిత్రం కంప్లీట్ కావడానికి... కమల్ హాసన్ ట్యాలెంట్, ప్లానింగ్ లే ప్రధాన కారణమని పొగిడేస్తోంది. వీటన్నిటికి తోడు ఈమె 50వ చిత్రంగా తూంగావనం రిలీజ్ కానుండడంతో.. సెంటిమెంటల్ గానూ బోలెడన్ని హోప్స్ పెట్టుకుంది. ఈ మూవీకోసం త్రిషకు గౌతమి స్టయిలింగ్ చేయడం విశేషం. కేవలం గెటప్ తోనే రెడీ చేసేశారని.. చిన్నపాటి మేకప్, కనీసం ఐలాష్ లు కూడా ఉపయోగించలేదంటోంది త్రిష. అంటే తాను రియల్ లైఫ్ లో ఎలా కనిపిస్తానో, అలాగే తుంగావనంలో కనిపించనున్నానని చెప్పింది.
దీనికి తోడు స్టోరీ ప్రకారం ఓ క్లబ్ లో ఓ రాత్రి జరిగిన సంఘటనలే తూంగావనం కాన్సెప్ట్. అంటే సినిమా అంతా ఒకే గెటప్ లో కనిపించాల్సి ఉంటుంది. ఒకే ఎమోషన్ ని కూడా క్యారీ చెయ్యాలి. సాధారణంగా సినిమా రిలీజ్ సమయంలో ఎలాంటి టెన్షన్ ఉండదని, కానీ ఈసారి మాత్రం కొంత టెన్స్ ఫీలవుతున్న విషయం వాస్తవమేనని యాక్సెప్ట్ చేసింది త్రిష. తమిళ్ లో నవంబర్ 10న వస్తున్న తూంగావనం, తెలుగులో పది రోజులు ఆలస్యంగా చీకటి రాజ్యం పేరుతో నవంబర్ 20న రిలీజ్ అవుతుంది.