కూతురితో .. కుమారుడితోను స్టార్ హీరో ప్రయోగాలు!
పఠాన్ 2 గురించి తొందరలోనే వివరాలు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.
షారూక్ ప్రస్తుతం తన నటవారసురాలు సుహానాతో కలిసి 'కింగ్' చిత్రంలో నటిస్తున్నాడు. సుజోయ్ ఘోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది 2026 లో వస్తుంది. ఈ సినిమా తర్వాతా షారూఖ్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. తదుపరి జవాన్ 2, పఠాన్ 2 చిత్రాలు చేయాల్సి ఉంది. జవాన్ 2 గురించి సరైన జవాబు లేదు కానీ, యష్ రాజ్ బ్యానర్ పఠాన్ 2ని తెరకెక్కించేందుకు సన్నాహకాల్లో ఉంది. ఈ సినిమా తర్వాత టైగర్ వర్సెస్ పఠాన్ తెరకెక్కించాల్సి ఉంటుంది. పఠాన్ 2 గురించి తొందరలోనే వివరాలు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.
అయితే వీటన్నిటి నడుమా కింగ్ ఖాన్ షారూఖ్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కోసం తన కుమారుడు ఏ.బి.రామ్ తో కలిసి పని చేస్తున్నాడనేది ఎందరికి తెలుసు? ఇప్పటికే కింగ్ సినిమా కోసం సుహానా ఖాన్ తో కలిసి పని చేస్తున్న షారూఖ్.. తన చిన్న కుమారుడు ఏ.బి.రామ్ తో కలిసి ఏ సినిమా చేస్తున్నాడు? అనేది ఇంకా సీక్రెట్ గానే ఉంది. కానీ నిజంగానే ఈ ప్రాజెక్ట్ ఉంది.
అది `ముఫాసా`. హాలీవుడ్ అనువాద చిత్రం. `ది లయన్ కింగ్`కి సీక్వెల్. ఇటీవల ముంబైలోని డబ్బింగ్ స్టూడియోలో కుమారుడు అబ్‌రామ్‌తో కలిసి షారూఖ్ కనిపించారు. కుమారునితో కలిసి తన కార్ వైపు వెళుతూ కనిపించాడు. ఈ సంవత్సరం డిసెంబర్ 20న విడుదల కాబోతున్న డిస్నీ చిత్రం `ముఫాసా: ది లయన్ కింగ్`లో తండ్రీకొడుకులు వరుసగా ముఫాసా.. దాని చిన్న వెర్షన్‌కి తమ గాత్రాన్ని అందిస్తున్నారు. వాల్ట్ డిస్నీ స్టూడియోస్ ఇండియా హిందీ ట్రైలర్‌ను ఇప్పటికే ఇన్ స్టాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. SRK ప్రస్తుతం గ్యాప్ తీసుకోలేదు. హాలీవుడ్ సినిమా కోసం పని చేస్తున్నారని దీనిని బట్టి అర్థమవుతోంది.