అనటం ఎందుకు? సారీ చెప్పటం ఎందుకు త్రిష

Update: 2017-01-14 04:46 GMT
వెనుకా ముందు చూసుకోకుండా తొందరపడి మాట్లాడటం.. దొరికిపోవటం.. ఆ తర్వాత సారీలు చెప్పటం. ఇదంతా అవసరమా? అనిపిస్తుంది ప్రముఖ సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురైనప్పుడు చూస్తుంటే. అయితే.. ఇదంతా స్వయంకృతాపరాధమేనని చెప్పక తప్పదు. తాము మాట్లాడేది రీల్ లైఫ్ లో కాదని.. రియల్ లైఫ్ అన్న విషయాన్ని మర్చిపోకూడదు. రీల్ లైఫ్ లో అయితే.. ఆదుకోవటానికి హీరో వస్తాడు. కానీ.. రియల్ లైఫ్ లో అలాంటి సీన్లు తక్కువగా ఉంటాయి. ఆ విషయం అందాల భామ త్రిషకు ఇప్పుడు బాగా అర్థమయ్యే ఉంటుంది.

జంతు సంరక్షణ ప్రేమికురాలైన త్రిషకు.. తమిళనాట సంక్రాంతి పండుగ వేళ ఆడే జల్లికట్టు ఆట అస్సలు నచ్చదు. జంతువుల్ని అంత అమానుషంగా హింసిస్తారా? అన్నది ఆమె డౌట్. అందుకే మనసులో అనుకునే మాటల్ని ఎవరేం అనుకుంటారన్న ఆలోచన లేకుండా బయటకు చెప్పేసింది. తమిళులు అమితంగా ఇష్టపడే జల్లికట్టు ఆట ఆడుడేందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఓ పక్క లోకనాయకుడు కమల్ హాసన్ లాంటోళ్లు జల్లికట్టు ఆట ఆడాల్సిందేనని.. ఒకవేళ అలాంటి వద్దంటే చికెన్ బిర్యానీ మీద కూడా తినకూడదని చెప్పాలంటూ చెబుతున్న వేళ.. త్రిష మాత్రం అందుకు భిన్నంగా చేసిన వ్యాఖ్యలు తమిళుల మనోభావాల్ని తీవ్రంగా గాయపర్చాయి. ఓపక్క జల్లికట్టుపై సుప్రీం వ్యాఖ్యలపైనే రగిలిపోతున్న తమిళులు.. త్రిష చేసిన వ్యాఖ్యలు మరింత మండిపోయేలా చేశాయి.

దానికి ఫలితంగా సౌత్ చెన్నైకి 450 కిలోమీటర్ల దూరంలోని శివగంగలో త్రిష నటిస్తున్న ‘గర్జన’ చిత్ర షూటింగ్ ను అడ్డుకున్నారు. షూటింగ్ స్పాట్ నుంచి బయటకు రావాలంటూ తీవ్ర స్థాయిలో నినాదాలుచేయటమే కాదు.. ఆందోళనకారులు పెద్ద ఎత్తున ఆందోళనను నిర్వహించారు. ఈ యవ్వారం సీరియస్ గా మారి.. తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న వేళ.. బిక్కుబిక్కుమంటూ బయటకు వచ్చిన త్రిష.. సారీ అంటూ చెంపలేసుకునేసరికి.. సరేనని ఊరుకున్నారు. ఇలాంటివన్నీ మనకు అవసరమా త్రిష. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News