తెలుగు హీరోయిన్లంటే టాలీవుడ్ దర్శక నిర్మాతలకు చిన్న చూపుండొచ్చు కానీ.. మన హీరోయిన్లకు తమిళంలో మాత్రం మంచి డిమాండే ఉంది. స్వాతి, శ్రీదివ్య లాంటి వాళ్లు అక్కడమంచి పేరు సంపాదించారు. ఈ మధ్య ఆనంది అలియాస్ రక్షిత కూడా అక్కడ బాగానే పాపులారిటీ సంపాదించింది. ఈ రోజుల్లో, బస్ స్టాప్ లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసిన రక్షిత తమిళంలో ఆనంది అనే పేరుతో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పటికే పోరియాలన్, కాయల్ అనే హిట్ సినిమాల్లో నటించిన ఆనంది చేతిలో ఇప్పుడు ఐదు సినిమాలుండటం విశేషం. అందులో మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ కుమార్ సరసన నటిస్తున్న ‘త్రిష ఇల్లాన నయనతార’ అనే క్రేజీ ప్రాజెక్టు ఒకటి.
టైటిల్ తో భలేగా ఆకర్షించిన ఈ సినిమా ట్రైలర్ తో మరింత కిక్కిచ్చింది. త్వరలోనే భారీ స్థాయిలో విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయడానికి నిర్ణయించారు. తమిళ టైటిల్ నే తెలుగులోకి అనువదించి త్రిష లేదా నయనతార అని పేరు పెట్టారు. ఇక్కడ చిన్నాచితకా పాత్రల్లో కనిపించిన ఆనంది తమిళంలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చకుని.. తిరిగి టాలీవుడ్లో అడుగుపెట్టబోతోందిప్పుడు. ఆదిక్ రవిచంద్రన్ అనే కొత్త దర్శఃకుడు రూపొందించిన ఈ సినిమాలో ఒకప్పటి టాప్ హీరోయిన్ సిమ్రాన్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. కొంచెం అడల్ట్ కామెడీ కలిపి వడ్డించబోతున్న ఈ వినోదాల విందు తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంటుందో.. ఆనందిని మనోళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.