జుట్టుకు పెళ్లికి లింక్‌ ఏంట్రా బాబు?

Update: 2018-09-13 03:55 GMT
టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌లో త్రిష హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చి పుష్కర కాలం ఎప్పుడో పూర్తి చేసుకుంది. కెరీర్‌ ఆరంభంలో టాప్‌ స్టార్స్‌ తో సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం ఆఫర్లు తగ్గడంతో పెళ్లికి సిద్దమైనట్లుగా వార్తలు వచ్చాయి. తమిళ నిర్మాత వరుణ్‌ మణియన్‌ తో ఈఅమ్మడు వివాహ నిశ్చితార్థం కూడా జరిగినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఇద్దరు చట్టా పట్టాలేసుకుని తిరగడంతో పాటు, ఫొటోలకు ఫోజులు ఇవ్వడం, పెళ్లికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అంటూ ప్రచారం జరిగింది. కాని కారణం ఏంటో కాని పెళ్లి క్యాన్సిల్‌ అయ్యింది.

పెళ్లి క్యాన్సిల్‌ తర్వాత త్రిష మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలని ప్రయత్నించింది. సక్సెస్‌ లేకున్నా కూడా త్రిషకు అవకాశాలు మాత్రం అడపా దడపా వస్తూనే ఉన్నాయి. తాజాగా సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ‘పేట’ మూవీలో ఛాన్స్‌ ను దక్కించుకుంది. త్రిష ఇటీవల కొత్త హెయిర్‌ స్టైల్‌ తో సోషల్‌ మీడియాలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ‘పేట’ మూవీ కోసం ఈ లుక్‌ అంటూ అంతా అనుకున్నారు. తన కొత్త హెయిర్‌ స్టైల్‌ గురించి త్రిష స్పందిస్తూ ఒక అమ్మాయి జుట్టు కత్తిరించుకుంటే ఆ అమ్మాయి జీవితంలో ఏదో పెద్ద మార్పు సంభవించబోతుంది అని అర్థం అంటూ చెప్పుకొచ్చింది.

త్రిష మాటలకు అంతా కూడా ఆమె పెళ్లి చేసుకోబోతుందేమో అంటూ ఊహాగాణాలు చేసేశారు. ఒక అమ్మాయికి జీవితంలో పెద్ద సంఘటన అంటే పెళ్లే, కనుక త్రిష త్వరలోనే పెళ్లి కూతురు అవ్వడం ఖాయం అంటూ సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తుంది. ఈ సమయంలో కొందరు మాత్రం జుట్టుకు పెళ్లికి లింక్‌ ఏంట్రా బాబు అనుకున్నారు. త్రిష కొత్త హెయిర్‌ స్టైల్‌ గురించి ఆమె తల్లి ఉమా కృష్ణన్‌ స్పందిస్తూ అది కేవలం ఫ్యాషన్‌ కోసమే అని, త్రిష పెళ్లి ప్రచారం పుకార్లే అంటూ తేల్చి పారేశారు. త్రిష జీవితంలో పెద్ద మార్పు ఏంటీ అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.
Tags:    

Similar News