త్రిష జూనియర్‌ ని చూశారా!!

Update: 2017-04-20 13:47 GMT
జంతు ప్రేమ విషయంలో బోలెడంత మంది ప్రచారం చేస్తుంటారు. ఇలా చేయాలి.. అలా చేయండి అని బోలెడన్ని మాటలు చెప్పేస్తుంటారు. కానీ ఈ చెప్పే వాటిలో కొన్నైనా పాటించే వారు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. కానీ జనాలకు చెప్పడమే కాదు.. అంతకంటే ఎక్కువగానే జంతులను ప్రేమిస్తుంది త్రిష.

అంతేనా వాటిని తన బిడ్డల్లాగే చూసుకుంటూ ఉంటుంది కూడా. తాజాగా త్రిష చేతిలోకి ఓ జూనియర్ వచ్చేసింది. జూనియర్ అంటే.. త్రిష కన్న బిడ్డలా చూసుకునే ఫిమేల్ డాగీ అన్నమాట. దీని పేరేంటో తెలుసా.. జూనియర్ కృష్ణన్. తన పేరు త్రిషా కృష్ణన్ లోంచి తన బుజ్జి ఆడ కుక్క పిల్లకు ఓ పేరు ఇచ్చేసింది త్రిష. అంతే కాదు.. దాన్ని కన్న కూతురుగా చూసుకుంటూ తెగ ముచ్చట పడిపోతోంది చెన్నై బ్యూటీ. కూతురే కాదు.. త్రిష దగ్గర ఓ కొడుకు కూడా ఉన్నాడు. మేల్ డాగ్ అని మళ్లీ చెప్పాల్సిన పని లేదు కాబట్టి.. ఆ మగ కుక్క  పేరు క్యాడ్ బరీ.

అప్పట్లో ఆ కుక్కతో తెగ హంగామా చేసిన త్రిష.. ఇప్పుడు జూనియర్ కృష్ణన్ తో టైం స్పెండ్ చేస్తోంది. ఈ రెండే కాదు.. త్రిష అనేక వీధి కుక్కలను దత్తత తీసేసుకుని తెగ సేవలు చేసేస్తూ ఉంటుంది. ఈ మధ్య వివాదం కారణంగా వదిలేసింది కానీ.. లేకపోతే పెటా యాక్టివిటీస్ లో బాగా చురుగ్గానే పాల్గొనేది త్రిష. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News