మరీ ఇలా భయపెట్టేస్తే ఎలా త్రిషా?

Update: 2015-12-23 10:22 GMT
కెరీర్ ఆరంభం నుంచి ఎప్పుడూ స్వీట్, క్యూట్ క్యారెక్టర్లే వేస్తూ వచ్చింది త్రిష. ఐతే వయసు మీద పడ్డాక అమ్మడికి విభిన్నమైన పాత్రల మీద మనసు మళ్లినట్లుంది. ఈ మధ్యే ‘చీకటి రాజ్యం’ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీన్లు చేసి మెప్పించింది చెన్నై చిన్నది. ఇక తమిళ, తెలుగు భాషల్లో త్రిష ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ కూడా భిన్నమైనవే. నాయకి పేరుతో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ మూవీలో హత్యలు చేసే అందమైన లేడీ పాత్ర చేస్తున్న త్రిష.. ‘ఆరణ్మయి-2’లో దయ్యం పాత్ర చేస్తోంది. త్రిష ఇలా డెవిల్ క్యారెక్టర్ చేయడం ఇదే తొలిసారి.

ఇప్పటికే ‘ఆరణ్మయి-2’కు సంబంధించిన పోస్టర్లు ఆసక్తి రేపాయి. తాజాగా త్రిష దయ్యం పాత్రలో కళ్లు విప్పార్చుకుని చూస్తున్న పోస్టర్ ఒకటి వదిలారు. అందులో త్రిషను చూస్తే నిజంగానే భయం కలగడం ఖాయం. ఇప్పటిదాకా అందంగా, ముద్దు ముద్దుగా కనిపించిన త్రిషను ఈ కొత్త అవతారంలో చూసిన అభిమానులు జడుసుకుంటున్నారు. ఈ సినిమాలో మరో అందాల దయ్యం కూడా ఉంది. ఆమే.. హన్సిక. గత ఏడాది సూపర్ హిట్ అయిన ‘ఆరణ్మయి’కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా ఇది. ఫస్ట్ పార్ట్ లో హన్సిక మాత్రమే ఉండగా.. ఈసారి త్రిష కూడా తోడైంది. సుందర్.సి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్దార్థ్ హీరోగా నటిస్తున్నాడు. ముందు సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్న ఈ సినిమాను జనవరి 29కి వాయిదా వేశారు. తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయి.
Tags:    

Similar News