త్రిష .. ఒక ప్రత్యేకమైన అందం. చిరుగాలి లాంటి చిరునవ్వుతోనే మనసులను ఆక్రమించే ఆకర్షణ ఆమె సొంతం. అలాంటి త్రిష కొంతకాలంగా తమిళ తెరకి మాత్రమే పరిమితమైపోయింది. అందువల్లనే ఆమె 'పొన్నియిన్ సెల్వన్' సినిమా విడుదల కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తోంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించే ఈ సినిమాకి మణిరత్నం దర్శకత్వం వహించారు. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాకి, భారీ తారాగణమే ప్రధానమైన ఆకర్షణ. చోళరాజుల కాలంలో .. చారిత్రక నేపథ్యంలో నడిచే ఆసక్తికరమైన కథ ఇది.
సౌత్ నుంచి ప్రపంచపటాన్ని ఆక్రమించనున్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రం ఇది. అలాంటి ఈ సినిమాలో విక్రమ్ .. కార్తి .. జయం రవి .. ఐశ్వర్య రాయ్ .. త్రిష ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా వివిధ భాషల్లో భారీస్థాయిలో విడుదల కానుంది. దాంతో ఆర్టిస్టులంతా కూడా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో 'కుందవై' పాత్రలో త్రిష కనిపించనుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో త్రిష మాట్లాడుతూ, ఈ సినిమాను గురించి ... తన పాత్రను గురించి అభిమానులతో పంచుకున్నారు.
"మణిరత్నం గారు ఈ సినిమాలో నాకు ఒక ముఖ్యమైన పాత్రను ఇచ్చారు. ఈ పాత్ర చాలా విలక్షణంగా కనిపిస్తుంది. ఆయన ఈ పాత్రను డిజైన్ చేసిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. చారిత్రక నేపథ్యంలోని పాత్ర కావడంతో కాస్ట్యూమ్స్ పరంగా .. నడక పరంగా .. హావభావాల పరంగా పూర్తిగా మారిపోవలసి ఉంటుంది. నన్ను నేనే కొత్తగా చూసు కుంటున్నట్టుగా అనిపించింది. ఇంతవరకూ జయం రవి జోడీగా రెండు సినిమాలు చేశాను .. ఈ సినిమాలో ఆయన చెల్లెలి పాత్రలో కనిపించడం కొత్తగా అనిపించింది.
మణిరత్నం గారి గురించి మీకు తెలిసిందే .. ఒక పట్టాన ఆయన ఓకే చెప్పరు. అచ్చమైన తమిళంలో డైలాగ్స్ చెప్పవలసి రావడంతో నాకు చాలా కష్టంగా అనిపించింది. భాష సరిగ్గా తెలిస్తేనే కదా .. భావోవోద్వేగాలు పలుకుతాయి. డైలాగ్స్ పలికే విషయంలో నా అవస్థను మణిరత్నంగారికి చెబుతూ ఆయన వెంటపడటంతో, సరళమైన తమిళ భాషలోకి డైలాగ్స్ మార్చారు.
ఈ విషయంలో నేను ఆయనను బాగానే ఇబ్బంది పెట్టి ఉంటానని అనుకుంటున్నాను. ఐశ్వర్య రాయ్ గారి కాంబినేషన్ లోను ఎక్కువ సీన్స్ చేశాను. ఆమెతో కలిసి నటించడం ఒక అందమైన అనుభవం. కథ పరంగా 'కుందవై' చాలా ధైర్యవంతురాలు .. ఇకపై ఆమెలా ఉండాలని అనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.