కెరీర్లో చాలా వేగంగా స్టార్ ఇమేజ్ సంపాదించింది త్రిష. అలాగే చాలా వేగంగానూ స్టార్ ఇమేజ్ కోల్పోయింది. అనుష్క, నయనతార, కాజల్, తమన్నా, సమంత లాంటి హీరోయిన్లలా దీర్ఘ కాలం టాప్ లెవెల్లో ఆమె కొనసాగలేకపోయింది. ఏడెనిమిదేళ్ల కిందటే డిమాండ్ కోల్పోయి నామమాత్రంగా కథానాయికగా కొనసాగుతోంది. 96 లాంటి ఒకటీ అరా తప్ప గత దశాబ్దంలో త్రిషకు చెప్పుకోదగ్గ హిట్లు లేవు. అయినా సరే.. ఆమె బడాయి మాత్రం తక్కువగా లేదు.
అప్పుడప్పడూ మంచి అవకాశాలు వస్తున్నా.. వాటిలో సెలెక్టివ్‌గా ఎంచుకోవడం, కొన్ని సినిమాలు ఓకే చెప్పి తర్వాత పాత్రలు నచ్చలేదని వైదొలగడం త్రిషకు మామూలే. ఒకప్పుడు పెద్దగా డిమాండ్ లేని సమయంలో ఆమెకు రవితేజ సరసన సారొచ్చారు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఫ్లాష్ బ్యాక్‌లో రిచా గంగోపాధ్యాయ చేసిన పాత్రకు ముందు త్రిషనే ఎంచుకున్నారు. కానీ ఆ పాత్ర నచ్చక ఆ చిత్రం నుంచి వైదొలగిందామె.ఆ తర్వాత కొన్నేళ్ల కిందట విక్రమ్ హీరోగా మొదలైన సామి-2లో ఓ కథానాయికగా త్రిషను ఎంచుకున్నారు.
సామిలో త్రిష చేసిన పాత్రకు కొనసాగింపు పాత్ర అది. కానీ దానికి ప్రాధాన్యం లేదని.. కీర్తి సురేష్‌కే స్క్రీన్ టైం ఎక్కువ ఉందని సినిమా మొదలయ్యాక తప్పుకుంది త్రిష. ఇప్పుడు తెలుగులో ఏకంగా మెగాస్టార్ చిరంజీవికే త్రిష హ్యాండిచ్చేసింది. ఈ సినిమా లో ఇద్దరు హీరోయిన్లకు చోటుంది. మరో కథానాయికతో పోలిస్తే తన పాత్ర తక్కువ అని భావించే త్రిష ఈ సిఇనమా నుంచి తప్పుకున్నట్లుగా చెప్పుకుంటున్నారు. తనకు హామీ ఇచ్చినట్లుగా పాత్ర లేదనే విషయాన్ని త్రిష పరోక్షం గా చెప్పకనే చెప్పింది. ఈ వయసులో, కెరీర్ ఇప్పుడున్న దశలో పాత్ర ఎలా ఉన్నా చిరు సినిమాలో త్రిష చేయాలి. కానీ ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుని తన పొగరు తగ్గలేదని.. తాను తానేనని మరోసారి చాటిచెప్పింది.