త్రిషను ఫుల్లుగా వాడుకుంటున్నారా?

Update: 2016-01-28 10:09 GMT
చెన్నై సుందరి త్రిష ఇప్పుడు తన కెరీర్ లోనే చాలా కీలకమైన స్టేజ్ లో ఉంది. 50కి పైగా సినిమాలు చేసేయడంతో లేడీ సూపర్ స్టార్ అని ప్రచారం చేసుకుంటోంది కానీ.. పరిస్థితి అలా లేదన్న మాట వాస్తవం. ఇప్పుడీ బ్యూటీ చేతిలో ఉన్న సినిమాలు తక్కువే. ముఖ్యంగా రెండు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుండడంతో.. వాటి రిజల్ట్ ఇప్పుడామెకు చాలా ముఖ్యం.

నాయకి అనే మూవీలోను, అరణ్మణై2లోనూ దెయ్యం పాత్రల్లో కనిపించనుంది త్రిష. కళావతి పేరుతో కోలీవుడ్ మూవీ అరణ్మణై2 ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయింది. ఈ మూవీలో దెయ్యంగానే కాదు.. మధ్యమధ్యలో అందాలు ప్రదర్శించడంలోనూ త్రిషను ఉపయోగించుకున్నారు మేకర్స్. మామూలుగా అయితే త్రిషను దెయ్యం పాత్రలో యాక్సెప్ట్ చేయడం కష్టమే కానీ.. అరణ్మణై సంగతి వేరు. ఇందులో హన్సిక కూడా దెయ్యంగానే కనిపిస్తుంది. ఇక అందాల ఆరబోత విషయానికొస్తే.. త్రిష తడి సొగుసులను కూడా బాగానే చూపించబోతున్నారు. సాధారణంగా ఈ భామ గ్లామర్ పాత్రలకు ఫేమస్సే కానీ.. ఎక్స్ పోజింగ్ విషయంలో అంత అడ్వాన్స్ డ్ గా ఏమీ ఉండదు. ఏం చేసినా లిమిట్ వరకే అన్నట్లుగా ఉండడం త్రిష స్టైల్.

కానీ ఇప్పుడు మాత్రం ట్రెండ్ మార్చినట్లుగా అర్ధమవుతోంది. తడి దుస్తులు పిండుకోవడం, ఒంపుసొంపులను కెమేరా ముందు పెట్టడం లాంటి వాటికి కూడా సై అనేసింది. మేకర్స్ కూడా చాలా జాగ్రత్తగా వాటిని కెమేరా కంటితో బంధించేసి, ప్రేక్షకులకు అందించబోతున్నారు. సో.. కళావతిలో త్రిష భయపెట్టడమే కాదు.. అందాల విందుతో పసందైన భోజనం కూడా పెట్టనుంది.
Tags:    

Similar News