హీరోయిన్ గా టాలీవుడ్, కోలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది త్రిష! అన్నీ సక్రమంగా జరుగుతున్న సమయంలో వ్యాపారవేత్త, తమిళ సినీ నిర్మాత వరుణ్ మణియన్ తో పెళ్లికి సిద్ధం అయ్యింది. ఆ వార్త పూర్తిగా జనాలకు తెలిసేలోపే ఎంగేజ్ మెంట్ ఫోటోలు నెట్ లో ప్రత్యక్షం అయ్యాయి! ఇంకేముంది... మరో రెండు లేక మూడు నెలల్లో త్రిషకు పెళ్లి అని అంతా అనుకున్నారు. కానీ... ఇంతలోనే ఏదో అయ్యింది, మరేదో జరిగింది... ఫలితంగా "ఐయాం సింగిల్" అంటూ త్రిష చెప్పుకొచ్చింది! దీంతో త్రిష పెళ్లి మ్యాటర్ సమాప్తం అయ్యింది. ఈ బాద, వేదన త్రిష మాటల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది!
తాజాగా పెళ్లి, విడాకులు వంటి విషయాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్న త్రిష... మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. వివాహం.. అనంతరం విభేదాలు.. ఫలితంగా విడాకులు.. కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు.. ఇలా కొత్త కొత్త తలనొప్పులు తెచ్చుకోవడం కంటే... పెళ్లికి ముందే విడిపోవడం మంచిదని వ్యాఖ్యానించింది. అసలు పెళ్లి అయితేనే కదా విడిపోవడం అనే కాన్సెప్ట్ వచ్చేది అని అమాయకంగా ఆలోచించే జనాలకు మరింత క్లారిటీ ఇచ్చింది త్రిష!
ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లిచేసుకుని మనస్పర్థలు వచ్చి విడిపోవడం కంటే... పెళ్లికి ముందు సహజీవనం చేసుకుని, బాగా అర్థం చేసుకుని అప్పుడు పెళ్లి చేసుకోవాలని సూచిస్తుంది. ఆ సహజీవనం సమయంలోనే ఒకరి అభిప్రాయాలు, ఆలోచనా విధానాలు మరొకరికి తెలుస్తాయి కాబట్టి... ఆ సమయంలోనే పెళ్లి చేసుకోవాలో, వద్దో నిర్ణయించుకోవాలని సెలవిస్తుంది. ఇలా చేస్తే కుటుంబ సమస్యలు తలెత్తవని అంటుంది. త్రిష సలహా విన్నవారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. కొంతకాలం కలిసి ఉండి, అన్ని రకాల సుఖాలూ చూసి తర్వాత పెళ్లి చేసుకొవాలని, అప్పుడు కూడా నచ్చకపోతే మానేసి మరొకరిని తగులుకోవచ్చని త్రిష చెప్పడంవెనక... వ్యక్తిగత విషాదం బాగా పనిచేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు!