నాయకిగా రానుంది హాటీ త్రిష. ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీని త్రిష కోసమే రాసుకున్నానని డైరెక్టర్ చెప్పాడు. హారర్ కామెడీ జోనర్ లో వస్తున్న ఈ మూవీ షూటింగ్ కి ఆగస్ట్ 20న ముహూర్తం షాట్ తీయనున్నారు. ఈ సినిమాకి తను కూడా డబ్బులు పెడుతోందట. త్రిష సమర్పించుకుంటోంది నాయకి కోసం. స్టార్ హీరోలందరూ దూరం పెడుతున్నారు ఇప్పుడీ ముదురు హీరోయిన్ ని. అయినా సరే.. కాస్త చెప్పుకోదగ్గ మూవీల్లోనే నటిస్తోంది.
నిశ్చితార్ధం దాకా వచ్చిన పెళ్లి ఆగిపోయాక... అవకాశాలు కూడా బాగానే పెరిగాయి. ఇలాంటి సమయంలో త్రిష ప్రొడ్యూసర్ గా మారడం ఆశ్చర్యం వేసే సంఘటనే. ఈ మూవీని కంప్లీట్ చేసేందుకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ పుచ్చుకోవడం లేదు ఈ అమ్మడు. అయితే లాభాల్లో షేర్ తీసుకోవాలనే ఒప్పందం ఉంది లెండి. చూస్తుంటే తోటి హీరోయిన్లను చూసి బాగా ఇన్ స్పైర్ అయినట్లుగా కనిపిస్తోంది త్రిష. ఛార్మి, అనుష్క లు ఇలా చేతులు కాల్చుకున్నవారే. జ్యోతిలక్ష్మి కి నిర్మాణ బాధ్యతలు తీసుకుని.. ఛార్మి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కానీ ఎంత ప్రయత్నించినా, ఈ సినిమా చూడని లేడీస్ ఆడవాళ్లే కాదన్నట్లుగా ప్రచారం చేసినా... జ్యోతిలక్ష్మి పేలిపోయింది. చూద్దాం ఈమె అదృష్టం ఎలా ఉందో. చేతులు కాలతాయో... కాసులు రాలతాయో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకూ ఆగాల్సిందే.