నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై.రవిశంకర్ కలసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వాస్తవ సంఘటన ఆధారంగా ఓ పవర్ ఫుల్ స్క్రిప్టు ని గోపీచంద్ రెడీ చేసినట్లు టాక్ నడుస్తోంది. అలానే ఇందులో ఇద్దరు హీరోయిన్లకి ప్రాధాన్యత ఉంటుందట. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఒక హీరోయిన్ గా త్రిష ని తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు మేకర్స్ త్రిషను సంప్రదించారని.. ఆమె సైడ్ నుంచి పాటిజివ్ రెస్పాన్స్ వచ్చేలా ఉందని టాక్. గతంలో బాలయ్య సరసన 'లయన్' సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. చివరగా ఆమె 2916లో 'నాయకి' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కనిపించింది. ఈ క్రమంలో త్రిష ఐదేళ్ల తర్వాత తెలుగులో బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే కనుక జరిగితే మరోసారి బాలయ్య - త్రిష జోడి వెండితెరపై కనువిందు చేస్తుందని చెప్పవచ్చు. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
ఇకపోతే 'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని బాలయ్యతో రూపొందించే సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే భారీ తారాగణం స్టార్ టెక్నిషియన్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కథ కోసం వేటపాలెంలోని వందేళ్ల క్రితం నాటి పురాతనమైన లైబ్రరీలో పాత వార్తాపత్రికలతో గోపీచంద్ పరిశోధన చేశారు. బీబాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న 'అఖండ' సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత గోపీచంద్ మలినేని సినిమా ప్రారంభం కానుంది.