టాలీవుడ్ లో కొంత మంది స్టార్ డైరెక్టర్ల పరిస్థితి విచిత్రంగా మారింది. కొంత మంది స్టార్ హీరోల గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తుంటే మరి కొంత మంది హీరోలు ఖాలీ లేక పోవడంతో తదుపరి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి కొంత మంది ప్రాజెక్ట్ కుదిరినా అనుకోని అడ్డంకుల వల్ల ముందుకు వెనక్కి వెళ్లలేని పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. స్టార్ డైరెక్టర్ క్రిష్ ఓ విధంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ని మాత్రం టైమ్ ఆడుకుంటోంది.
2020లో అల్లు అర్జున్ తో `అల వైకుంఠపురములో` మూవీని చేశారు. ఇది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న భారీ స్థాయిలో విడుదలై బన్నీ కెరీర్ లోనే తొలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి సంచనం సృష్టించింది. ఈ మూవీ విడుదలై మూడేళ్లవుతోంది. ఈ టైమ్ లో పవన్ `భీమ్లానాయక్` కు వర్క్ చేసిన త్రివిక్రమ్ డైరెక్టర్ గా దాదాపు మూడేళ్లు వేస్ట్ చేశాడని చెప్పక తప్పదు. `అల వైకుంఠపురములో` తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ ప్రాజెక్ట్ ని చేయాలనుకున్నారు. RRR వల్ల కొంత కాలం ఎన్టీఆర్ కోసం ఎదురుచూశారు.
మధ్యలో ఏం జరిగిందో ఏమో తెలియదు ఆ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఆగిపోయింది. ఆ తరువాత మహేష్ తో ఫైనల్ అయింది. ఈ సినిమాని మొందలు పెట్టాలని వేచి చూస్తూ కాలం గడిపేశారు. గతంలో ఇంత గ్యాప్ తీసుకోని త్రివిక్రమ్ ఈ సారి మాత్రం ఏకంగా మూడేళ్లు గ్యాప్ తీసుకోవడం, ఆ తరువాత మహేష్ తో మొదలు పెట్టిన సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడటం.. ఆ తరువాత మొత్తానికి మొదలైంది అనుకుంటే మహేష్ మదర్ ఇందిరాదేవి మృతితో మళ్లీ బ్రేక్ పడటం తెలిసిందే.
ఆ తరువాతైనా సెట్స్ పైకి వెళదామంటే హీరోయిన్ పూజా హెగ్డే కాలికి గాయం కాడంతో డిసెంబర్ కు తదుపరి షెడ్యూల్ ని త్రివిక్రమ్ పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఈ లొగా స్క్రిప్ట్ లో మార్పులు మొదలు కావడం.. ముందు చేసిన యాక్షన్ షెడ్యూల్ ని పక్కన పెట్టేయడం వంటి మార్పులు చేర్పులు చేస్తున్న సమయంలో మహేష్ ఫాదర్, సూపర్ స్టార్ కృష్ణ అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ కారణంగా మృతి చెందడంతో ఈ మూవీ షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలే ఎక్కువ గా కనిపిస్తున్నాయి.
కథ మారడంతో నటీనటులు కూడా మారే అవకాశం వుంది. ఇంతా మళ్లీ సెట్టయి సెట్స్ పైకి వెళ్లాలంటే డిసెంబర్ మిడ్ వరకు వేచి చూడక తప్పని పరిస్థితి. దీంతో త్రివిక్రముడి పరిస్థితేంటీ ఇలా అయిందని అంతా అనుకుంటున్నారు. డిసెంబర్ మిడ్ లో అయినా మహేష్ మూవీ పట్టాలెక్కుతుందా? లేక మళ్లీ ఏదైనా ట్విస్ట్ వుంటుందా అని త్రివిక్రమ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.