''వేరే ఒక హీరో మాట్లాడుతూ.. బాస్ మీకేనా.. మాక్కూడా ఫ్యాన్స్ ఉంటారు.. వాళ్ళకి ఛాన్సివ్వాలిగా'' అని నాతో చెబుతుంటే తల తీసేసినట్లు అయిపోయింది అంటూ 'ఒక మనసు' ఆడియో లాంచ్ లో బన్నీ కామెంట్ చేశారు. అలాగే.. ఒక పెద్ద దర్శకుడు మాట్లాడుతుంటే.. ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వకుండా పవర్ స్టార్ అని అరవడం కూడా బాధించిందని.. వారు మెకానికల్ గా ఏదో ఒకటి పవర్ స్టార్ గురించి చెప్పేసి వెళిపోతున్నారని అన్నాడు.
ఆ ఇద్దరూ ఎవరు అని ఊరంతా అనుకోవచ్చు.. కాకపోతే బుట్ట కింద కోడిపెట్ట మనకు మాత్రం కనిపించదా అంటూ.. కొంతమంది నిజాలే చెప్పేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో వరుణ్ తేజ్ ''లోఫర్'' సినిమా ఆడియో ఫంక్షన్ కు 'బాహుబలి' ప్రభాస్ చీఫ్ గెస్టుగా వచ్చాడు. అతడు మాట్లాడుతంటే.. ఒక గుంపు పవర్ స్టార్ అని అరవడం ప్రారంభించింది. ఇంకేముంది.. చివరకు విసుగు చెందిన ప్రభాస్.. ''ఐ లవ్ పవర్ స్టార్.. ఇప్పుడు మాట్లాడొచ్చా?'' అన్నాడు. అది రియాల్టీ. ఇకపోతే సన్ ఆఫ్ సత్యమూర్తి ఫంక్షన్ లో త్రివిక్రమ్ మాట్లాడుతుంటే కూడా ఇలాగే డిస్ర్టబ్ చేశారు. దీని బట్టి చూస్తే.. బన్నీ చెబుతున్న ఆ హీరో.. ఆ దర్శకుడు.. ప్రభాస్ అండ్ త్రివిక్రమేగా?
ఏదేమైనా పవన్ కళ్యాణ్ అభిమానులు తమ పద్దతి మార్చుకోవాలని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. చెప్పను బ్రదర్ అని ఒకరు చెప్పినా.. చూసుకుంటాం బ్రదర్ అని ఇంకొకరు కౌంటర్ ఇచ్చినా.. అసలు పరువుపోతోంది కదా బ్రదర్ అని న్యూట్రల్ అభిమానులు అంటున్నారు.