థియేటర్ కొన్న మాటల మాంత్రికుడు

Update: 2019-09-24 09:26 GMT
తన మాటలతోనే ప్రేక్షకులను ఆకట్టుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిమానం.నువ్వే నువ్వేతో దర్శకుడిగా మారి అరవింద సమేత వీర రాఘవ దాకా అప్రతిహతంగా సాగుతున్న జైత్రయాత్రలో ప్రస్తుతం అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. జులాయి - సన్ అఫ్ సత్యమూర్తి తర్వాత హ్యాట్రిక్ మూవీగా దీని మీద ఫ్యాన్స్ కు చాలా అంచనాలు ఉన్నాయి.

హారికా హాసిని బ్యానర్ ద్వారా నిర్మాణంలోనూ యాక్టివ్ గా ఉన్న త్రివిక్రమ్ కు బయట వ్యాపకాలు వ్యాపారాలు పెద్దగా ఉండవు కాని ఇటీవలే రాజమండ్రి దగ్గరలోని రాజానగరం రాయుడు కాంప్లెక్స్ థియేటర్ కొన్నట్టు తెలిసింది. ఈ డీల్ కొద్దినెలల క్రితమే జరిగినప్పటికీ బయటి ప్రపంచానికి అంతగా తెలియకపోయింది సో త్రివిక్రమ్ కూడా సినిమా హాల్స్ బిజినెస్ లోకి వచ్చేశాడన్న మాట.

గతంలో వివి వినాయక్ - వైవిఎస్ చౌదరి లాంటి దర్శకులు ఆల్రెడీ ఇందులో సక్సెస్ అయ్యారు. మహేష్ బాబు ఏకంగా భారీ ఎత్తున ఇందులో పెట్టుబడులు పెట్టేశాడు. ఇప్పుడు త్రివిక్రమ్ వంతు వచ్చిందన్న మాట. మంచి కమర్షియల్ సెంటర్ గా పేరున్న రాజమండ్రికి దగ్గరలో థియేటర్ అంటే చక్కని ఆలోచన  అని చెప్పొచ్చు. ఇదే తరహాలో ఇకపై కూడా వీటిని మరిన్ని కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారో లేదో కానీ మొత్తానికి మాటల మాంత్రికుడు తెలివైన నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీ టాక్.


Tags:    

Similar News