'భీమ్లా నాయ‌క్' లో త్రివిక్ర‌మ్ క్లాస్ ట‌చ్ మిస్సింగ్!

Update: 2022-02-22 23:30 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ -త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ గురించి చెప్పాల్సిన  ప‌నిలేదు. పవ‌న్ మాస్ ఇమేజ్ కి..అత‌ని త‌గ్గ క్లాస్ డైలాగులు రాయ‌డం త్రివిక్ర‌మ్ కే చెల్లింది. `అత్తారింటికి దారేది` లాంటి ఫ్యామిలీ స్టోరీ లోనే కావాల్సినంత క‌మర్శియాల్టీ జొప్పించి 100 కోట్లు సునాయాసంగా సాధించింది ఈ కాంబినేష‌న్. అంటే త్రివిక్ర‌మ్ క్లాస్ పంచ్ డైలాగులు ప‌వ‌న్ నోట అంత ఇంపాక్ట్ ఉంటుంది. బేసిక్ గానే త్రివిక్ర‌మ్ ఎంతటి యాక్ష‌న్ స‌న్నివేశాల‌కైనా త‌న‌దైన మార్క్ క్లాస్ పంచ్ డైలాగులు సర్వ‌సాధ‌ర‌ణం.

కానీ `భీమ్లా నాయ‌క్` ట్రైల‌ర్ ని ప‌రిశీలిస్తే అవ‌న్ని మీస్ అయిన‌ట్టే క‌నిపిస్తుంది. ఈ సినిమాకి త్రివిక్ర‌మ్ మాట‌లు..స్ర్కీన్ ప్లే అందించారు.  సాగ‌ర్. కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నా వెనుకుండి అస‌లు కథ న‌డిపించేది అంతా మాయావీనే అన్న‌ది అన‌ధికారికం.

ఈ సినిమా కోసం త్రివిక్ర‌మ్ అహ‌ర్నిశ‌లు శ్ర‌మించారు. మ‌రి త్రివిక్ర‌మ్ మార్క్ డైలాగులు...సెన్సిబిలిటీ ఎందుకు మిస్సైన‌ట్లు? అంటే రీమేక్ క‌థ కావ‌డ‌మే అందుకు కార‌ణ‌మా? అన్న సందేహం తెర‌పైకి వ‌స్తోంది.

త్రివిక్ర‌మ్ ఇప్ప‌టివ‌ర‌కూ రీమేక్ క‌థ‌ల్ని తెర‌కెక్కించి లేదు. ఆ చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసింది లేదు. ఏదైనా ఆయ‌న మార్క్ ఉండాల‌ని భావిస్తారు. కానీ `భీమ్లా నాయ‌క్` మాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `అయ్య‌ప్పునం కోషియ‌మ్` కి రీమేక్. ఈగో ప్యాక్ట‌ర్ సినిమాలో కీల‌క అంశం. మాతృక‌లో బిజుమీన‌న్-పృథ్వీరాజ్ పాత్ర‌లు పోటాపోటీగా సాగుతాయి. ఏ పాత్ర త‌క్కువ కాదు అక్క‌డ‌.

కానీ తెలుగు రీమేక్ అయ్యే స‌రికి సీన్ మారుతుంది కాబ‌ట్టి ప‌వ‌న్ పాత్ర‌ని ఇంకాస్త ప‌వ‌ర్ ఫుల్ గానే డిజైన్ చేసి ఉండొచ్చు. అలాగ‌ని రానా పాత్ర‌ని త‌గ్గించిన‌ట్లు  కాదు. ట్రైల‌ర్ లో రెండు పాత్ర‌ల స‌మాన‌త క‌నిపిస్తోంది.  అయితే ప‌వ‌న్ డైలాగుల విష‌యంలో ప‌వ‌ర్ ఫుల్ నెస్ త‌గ్గిన‌ట్లు క‌నిస్తుంది. డైలాగుల్లో ఎక్క‌డా త్రివిక్ర‌మ్ మార్క్ క‌నిపించ‌లేదు.

డైలాగుల్లో ఎండింగ్ వ‌ర‌కూ ఒకే టెంపోని  కొన‌సాగించిన‌ట్లు క‌నిపిస్తుంది. ఇలాంటి డైలాగులు రాయ‌డం మాయావీకి కూడా కొత్త ఎక్స్ పీరియ‌న్స్ ని ఇచ్చే ఉండొచ్చు అన్న‌ది కొందరి అభిప్రాయం. మ‌రి ట్రైల‌ర్ వ‌ర‌కూ త్రివిక‌మ్ క్లాస్ ట‌చ్ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. సినిమాలో ఏమైనా దానికి  స్కోప్ ఉందేమో చేడాలి.

ఇక ప‌వ‌న్ రెగ్యుల‌ర్ మ్యాన‌రిజ‌మ్ ని  కూడా `భీమ్లా నాయ‌క్` లో పెద్ద‌గా వ‌ర్కౌట్ చేసిన‌ట్లు ట్రైల‌ర్ లో  క‌నిపించ‌లేదు. మ‌రి ప‌వ‌న్ -త్రివిక్ర‌మ్ అనుకుని ఇలా ప్రీ ప్లాన్డ్ గా ముందుకు  వెళ్తున్నారా?  లేక  `భీమ్లా నాయ‌క్` స్ర్కిప్ట్ కి అవ‌స‌రం లేద‌ని లైట్ తీసుకున్నారా? అన్న‌ది సినిమా రిలీజ్ అయితే గానీ క్లారిటీ రాదు.

ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో కొత్త సినిమాని తెర‌కెక్కించే బిజీలో ఉన్నారు.  `స‌ర్కారు వారి పాట` షూటింగ్ స‌హా డ‌బ్బింగ్ ప‌నుల్ని మ‌హేష్ పూర్తిచేసాడు. ఈనేప‌థ్యంలో వీలైనంత త్వ‌రగా చిత్రాన్ని ప్రారంభించాల‌ని వెయిట్ చేస్తున్నారు. `భీమ్లా నాయ‌క్` ఈనెల 25న  రిలీజ్ అవుతుంది.

అప్ప‌టివ‌ర‌కూ త్రివిక్ర‌మ్ ప్ర‌చారం స‌హా ఇత‌ర ప‌నుల్లో బిజీ అవుతారు. అనంత‌రం మ‌హేష్ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌య్యే  అవ‌కాశం ఉంది.


Tags:    

Similar News