"కృష్ణా గాడి వీర ప్రేమ గాధ" సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు, నిర్మాతలు మరో సారి కలిసి తెరకెక్కిస్తున్న చిత్రం "లై". ఇప్పటికే నితిన్ లుక్ - హీరోయిన్ మేఘా ఆకాష్ అందచందాలు మరియు టీజర్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం వచ్చే వారం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సంధర్బంగా చిత్ర యూనిట్ రీసెంట్ గా త్రివిక్రమ్ చేతుల మీదుగా మణిశర్మ స్వరపరిచిన పాటలను రిలీజ్ చేసింది.
చాలా వరకు ఆడియో వేడుకలకి దూరంగా ఉండే త్రివిక్రమ్ నితిన్ కోసం లై ఆడియో ఫంక్షన్ కి వచ్చారు. అయితే ఈ వేడుకలో త్రివిక్రమ్ ఎప్పటిలానే తనదైన స్పీచ్ తో ఆకట్టుకున్నాడు. సినిమా యూనిట్ కి అల్ ది బెస్ట్ చెప్పిన త్రివిక్రమ్ తన శైలిలో సినిమా యూనిట్ ని పొగడ్తలతో ముంచెత్తారు. అంతే కాకుండా మరో అతిధిగా వేంచేసిన సుకుమార్ ని కూడా కలిసానని చెప్పారు త్రివిక్రమ్. ఇక త్రివిక్రమ్ స్పీచ్ విషయానికి వస్తే.. ఈ ఆడియో వేడుక ద్వారా ఎప్పుడు కలుసుకొని వారిని కలిసినట్లు చెప్పారు. ముఖ్యంగా సుకుమార్ తో కలిసి మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
అంతే కాకుండా త్రివిక్రమ్ , సుకుమార్ ఇచ్చిన స్పీచ్ కి తనదైన శైలిలో నవ్వుతూ ఓ కౌంటర్ వేశారు.. సాధారణంగా దర్శకులు రెండు రకాలు.. ఒకరు సెట్ లో డైరెక్ట్ చేసేవారు - మరొకరు ఎడిట్ రూమ్ లో డైరెక్ట్ చేశేవారు అని సుకుమార్ చెప్పిన విధానానికి త్రివిక్రమ్ మరో మాట కలిపి మూడో రకం డైరెక్టర్లు కూడా ఉంటారని చెబుతూ.. సినిమా మొత్తం కంప్లిట్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఇలా కాకుండా ఇంకోలా చేస్తే బావుంటుందనే డైరెక్టర్లు కూడా ఉంటారని అలాంటి దర్శకుల్లో తను ఒకరని చెప్పాడు త్రివిక్రమ్. ఈ మాటలకు అందరూ ఒక్కసారిగా నవ్వగా.. త్రివిక్రమ్ సినిమా యూనిట్ గురించి కొన్ని విషయాలను చెప్పి తనదైన శైలిలో స్పీచ్ ని ముగించేశారు.